
Hyper Aadi varsha Emmanuel in Mana Oori Devedu Event
Hyper Aadi : మల్లెమాల ఎప్పుడూ కూడా ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ప్రోమోలను వెరైటీగా కట్ చేసి.. ఏదో జరిగినట్టు భ్రమ కలిగింది.. అందరిలోనూ అనుమానాలు క్రియేట్ చేసి.. షో మీద, ఈవెంట్ మీద ఆసక్తి కలిగించేలా చేయడం టీఆర్పీ స్టంట్, స్ట్రాటజీ అవుతుంది. వీటిలో మల్లెమాల టీం ఆరితేరిపోయింది. అది ఏ ఈవెంట్ అయినా ఏ ప్రోగ్రాం అయినా కూడా మల్లెమాల తీరు మాత్రం ఒకటేలా ఉంటుంది. తాజాగా వినాయక చవితి ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులోనూ ఇలాంటి స్టంట్లే కనిపించాయి. మన ఊరి దేవుడు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో కృష్ణ భగవాన్, నాగినీడు, కుష్బూ వంటివారు ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఇక ఇందులో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం సందడి చేసింది. గెటప్ శ్రీను, వర్ష, ఇమాన్యుయేల్, ఆది ఇలా అందరూ రచ్చ రచ్చ చేశారు. ఇక మరీ ముఖ్యంగా వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమల మీద పరీక్షలు పెట్టారు. వారి చేతుల మీద కార్లు పోనిచ్చుకోవాలని అన్నారు. ఇక తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరి ఇమాన్యుయేల్ తన చేతుల మీదు నుంచి కారుని పోనిచ్చుకున్నాడు. ఇక వర్షను కూడా అలా చేయమని అన్నాడు. నువ్వొద్దు, నీ ప్రేమొద్దు అని వర్ష వెళ్లిపోయింది. కానీ చివరకు ఆమె చేతి మీద నుంచి కూడా కారుని పోనిచ్చారు. ఆ టాస్క్ అయిన తరువాత ట్యూబ్ లైట్లతో కొట్టుకునే టాస్క్ ఇచ్చాడు ఆది.
Hyper Aadi varsha Emmanuel in Mana Oori Devedu Event
అయితే ఈ ట్యూబ్ లైట్‌లతో తాము కొట్టుకోమని అంటారు వర్ష, ఇమ్ము. కానీ ఇంతలో ఆది దీంట్లో ఏముందని ఇమ్ముని కొట్టేస్తాడు. ఏదో నిజంగానే దెబ్బ తగిలినట్టు బిల్డప్ ఇస్తాడు ఇమ్ము. నా ఇమ్ముని కొడతావా? అంటూ వర్ష తెగ రెచ్చిపోతుంది. ఆదిని కూడా ట్యూబ్ లైట్‌తో కొడుతుంది. ఇక చివరకు వర్ష బ్యాక్ మీద ఆది తన ట్యూబ్ లైట్‌లతో వాయించేస్తాడు. అలా మొత్తానికి ఈ ముగ్గురు కూడా ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తారు. ఏదో ప్రమాదం జరిగినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇక ఈ ప్రోమోను చూసి జనాలంతా తలలు పట్టుకుంటున్నారు. ఇంకెన్నాళ్లు ఇలాంటివి చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.