Vijay Deverakonda : విజయ్ దేవరకొండ అంత ముద్దు వస్తున్నాడా.. వేదికపై అందరి ముందు ఆయనని ముద్దు పెట్టుకున్న మరో హీరో..!
Vijay Deverakonda : అర్జున్ రెడ్డి సినిమాతో అమ్మాయిలకి క్రష్‌గా మారాడు విజయ్ దేవరకొండ. ఆయనని చూస్తే అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. హీరోయిన్స్ సైతం విజయ్ దేవరకొండతో కలిసి నటించేందుకు చాలా ఆసక్తి చూపుతుంటారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రష్మిక అయితే ఏకంగా ఆయన ప్రేమలో పడిందని, వీరిద్దరు సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారని టాక్ నడుస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు పలు హింట్స్ ఇస్తున్నా కూడా పక్కా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అయితే విజయ్ దేవరకొండ కెరీర్‌కి మంచి బూస్టప్ ఇచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం 2017లో విడుదలైంది. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా, ఇందులో షాలిని పాండే కథానాయికగా నటించింది.
అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్‌కి సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చాయో అంతే ప్రశంసల జల్లు కూడా కురిసింది. మూవీని తమిళం, హిందీ భాషలలో కూడా రీమేక్ చేశారు. హిందీలో సందీప్ రెడ్డి వంగ ఈ మూవీని తన దర్శకత్వంలోనే కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి తెరకెక్కించాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ మూవీ 2019 లో రిలీజయి బాలీవుడ్ లో బడా విజయం సాధించింది. ఈ మూవీ దాదాపు 250 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో బాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్ అయ్యాడు.ఇక షాహిద్ కపూర్‌కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఓ ఈవెంట్ నిర్వహించగా ఇందులో షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ కలిసి సందడి చేశారు.
వేదికపై షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. విజయ్ కి నేను చాలా ప్రేమని ఇవ్వాలి. విజయ్ అర్జున్ రెడ్డి చేయకపోతే నా కబీర్ సింగ్ సినిమా లేదు అంటూ విజయ్ దేవరకొండ బుగ్గపై ఏకంగా ముద్దు కూడా పెట్టాడు షాహిద్ కపూర్. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోని బాలీవుడ్‌లో అంతగా పొగిడేసరికి తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్ రావడం లేదు. విజయ్ త్వరలో ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈసినిమా థియేటర్లో రిలీజయిన అనంతరం అమెజాన్ ప్రైమ్ లోనే రానున్న నేపథ్యంలో రౌడీ బాయ్ తన సినిమా తరపున అమెజాన్ ఈవెంట్లో పాల్గొన్నాడు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.