Shailaja Priya : 47 ఏళ్ల వయసులో కూడా యూత్ ఐకాన్‌గా.. నమ్మలేకపోతున్నాం..!
ప్రధానాంశాలు:
Shailaja Priya : 47 ఏళ్ల వయసులో కూడా యూత్ ఐకాన్‌గా.. నమ్మలేకపోతున్నాం..!
Shailaja Priya : టాలీవుడ్‌లో Tollywood సహాయ నటి, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎందరో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మమళ్ల శైలజ ప్రియ. తాజాగా తన సరికొత్త లుక్‌తో మళ్లీ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. 47 ఏళ్ల వయస్సులో కూడా తన ఫిట్‌నెస్, స్టైల్, గ్లామర్‌తో యూత్ ఐకాన్‌లా వెలుగొందుతున్నారు.

Shailaja Priya : 47 ఏళ్ల వయసులో కూడా యూత్ ఐకాన్‌గా.. నమ్మలేకపోతున్నాం..!
Shailaja Priya : ఇంత యంగ్‌గా..
తాజాగా ప్రియ తన కొత్త లుక్‌తో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె స్టైలిష్ హెయిర్‌కట్, క్లాస్‌లుక్ వేషధారణ చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వీడియోలో ఆమె యంగ్ బ్యూటీలా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేశారు. వీడియోకి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియ 1997లో ‘మాస్టర్’ సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టారు. తర్వాత “దొంగాట”, “గోకులంలో సీత” వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు.
అయితే ఆమె అసలు గుర్తింపు మాత్రం టెలివిజన్ ద్వారా వచ్చింది. అనేక ప్రముఖ తెలుగు సీరియల్స్‌లో నటించి హోమ్ ఆడియన్స్‌కి సుపరిచితులయ్యారు. ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మెదళ్లలో నిలిచి ఉన్నాయి. శైలజ ప్రియ నటిగా మాత్రమే కాకుండా, తన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. అందులో ఆమె చూపించిన నిజాయితీ, సహనంతో ప్రేక్షకుల మన్ననలు పొందారు.