Rythu Bharosa : రైతులకు అలర్ట్.. వారికి రైతు భరోసా క‌ట్‌.. రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ కీలక నిర్ణ‌యం..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 February 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : రైతులకు అలర్ట్.. వారికి రైతు భరోసా క‌ట్‌.. రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ కీలక నిర్ణ‌యం..!

Rythu Bharosa  : తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. అయితే, ఈసారి అందరికీ డబ్బులు పడవని, అర్హుల జాబితాలో భారీ మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. శాటిలైట్ సర్వే ఆధారంగా అనర్హులను ఏరివేసే పనిలో పడింది సర్కార్.

Rythu Bharosa : రైతులకు అలర్ట్.. వారికి రైతు భరోసా క‌ట్‌.. రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ కీలక నిర్ణ‌యం..!

Rythu Bharosa : రైతులకు అలర్ట్.. వారికి రైతు భరోసా క‌ట్‌.. రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ కీలక నిర్ణ‌యం..!

Rythu Bharosa : శాటిలైట్ సర్వేలో షాకింగ్ నిజాలు

రైతు భరోసా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గత కొన్ని నెలలుగా శాటిలైట్ సర్వే (Satellite Survey) నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల రెవెన్యూ గ్రామాల్లోని సాగు భూముల వివరాలను మ్యాపింగ్ చేసింది. ఈ సర్వే ఇప్పుడు పూర్తయింది. ఈ సర్వేలో సుమారు 10 శాతం భూముల్లో పంటలు వేయలేదని (Uncultivated lands) తేలింది. ఈ మేరకు ఫిబ్రవరి 6న వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేయనున్నారు.

Rythu Bharosa Update: ఆ భూములకు డబ్బులు బంద్

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందుతుంది. బీడు భూములు, రాళ్లు రప్పలతో ఉండి సాగుకు నోచుకోని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు ఇకపై రైతు భరోసా నిధులు జమ కావు. సర్వేలో తేలిన ఆ 10 శాతం భూములకు నిధులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి గుంటలో పంట సాగు అవుతుందా లేదా అనేది శాటిలైట్ ద్వారా పక్కాగా గుర్తించారు.

డబ్బులు పడేది ఎప్పుడంటే?

వాస్తవానికి సంక్రాంతి పండుగకే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడాల్సి ఉంది. కానీ ఈ సర్వే కారణంగా జాప్యం జరిగింది. జనవరి చివరి వారంలో వేస్తారని రైతులు ఆశించినా అది కుదరలేదు. అయితే, ఫిబ్రవరి 6న నివేదిక అందనుండటంతో.. ఆ వెంటనే నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో (February 2nd Week) అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గత వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మందికి లబ్ధి చేకూరగా.. ఈసారి యాసంగి సీజన్‌లో ఆ సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది. నిజమైన సాగు రైతులకే న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి