Bigg Boss Telugu 7 : సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు.. షకీలా ఫైర్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 10, 2023, 10:00 am

Bigg Boss Telugu 7 : సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకుంటున్నారా? ఎవరు అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ లో ఇవన్నీ కామనే కదా అంటారా? ఎంత కామన్ అయితే మాత్రం అదేమన్నా ఓయో రూమా? ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేసుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్లను చూసి తోటి కంటెస్టెంట్లే ఫైర్ అవుతుంటే ఇక ప్రేక్షకులు ఫైర్ అవడంలో అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే.. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి వచ్చిన రోజే పల్లవి ప్రశాంత్, రతిక ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

అది ప్రేమే అయితే ఓకే కానీ.. అది కాస్త కామంగా ఎక్కడ మారుతుందో అని జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ల చేష్టలు కూడా అలాగే ఉన్నాయి మరి. ఎక్కడ చూసినా ఇద్దరే కలిసి తిరగడం, ఇద్దరే తినడం, అన్ని పనులు ఇద్దరే కలిసి చేసుకోవడం చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు కూడా చిర్రెత్తుకొస్తోంది. అసలు ఏంటి వీళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారు. రైతు బిడ్డ అంటూ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మాత్రం పులిహోర కలుపుతున్నాడు అంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.సీక్రెట్ టాస్క్ లో భాగంగా షకీలాను బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాకు పిలుస్తాడు. అక్కడ ఇతర కంటెస్టెంట్ల గురించి చెప్పు షకీలా అంటే ప్రశాంత్ ఫేక్ అని డైరెక్ట్ గా చెప్పేసింది షకీలా.

shakeela fire on bigg boss telugu 7 contestants

shakeela fire on bigg boss telugu 7 contestants

Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్ ఫేక్ అంటూ చెప్పుకొచ్చిన షకీలా

అంతే కాదు.. హౌస్ లోనూ అప్పుడప్పుడు వీళ్ల రొమాన్స్ చూడలేక.. బాబోయ్.. సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇక్కడ అందరూ నటించడానికే వచ్చారు. ఎవ్వరినీ నమ్మలేం. అందరూ ఫేక్ గానే కనిపిస్తున్నారు అంటూ షకీలా బిగ్ బాస్ కు చెప్పింది. ఇక ఈ వారం నామినేషన్లలో షకీలా కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp