Shakeela : షోకు పిలిచి ఇలాంటివి చేయిస్తారా?.. సుమ మీద అరిచిన షకీలా

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 26, 2021, 3:00 pm

Shakeela షకీలా గురించి అందరూ ఒకలాంటి అభిప్రాయంతో ఉంటారు. ఆమె తెరపై చేసిన పాత్రలతో అలాంటి ఇమేజ్ ఆమెకు వచ్చింది. అయితే తెరపై అలాంటి పాత్రలు చేశారు? కదా తెర వెనుక కూడా అలానే ఉంటారు అని అనుకుంటే పొరబాటు అవుతుంది. తెరపై షకీలా కనిపించే దానికి తెర వెనుక ఆమె స్వభావానికి గుణాకి చాలా తేడా ఉంటుంది. అలాంటి పాత్రలు తనకు ఇష్టమై చేయలేదు.. పొట్టకూటి కోసం, కుటుంబం కోసం అలాంటి పాత్రలను వేసింది.

shakeela fires on anchor suma

shakeela fires on anchor suma

అయితే షకీలా జీవిత గాథ మాత్రం అడుగడుగా సుడిగుండాలే ఉంటాయి. నమ్మిన కుటుంబం మోసం చేసింది.. ప్రేమించిన అబ్బాయిలు కూడా నట్టేట ముంచేసిపోయారు.. చుట్టూ ఉండే స్నేహితులు డబ్బు కోసమే ఉన్నారు. అలా అన్నీ తెలిసి వచ్చే సరికి షకీలా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ప్రేమించడం షకీలా వీక్ నెస్. అలా ఎంతో మంది చేతిలో షకీలా మోసపోయింది. మీడియాకు ఎక్కువగా దొరకని షకీలా తాజాగా సుమ క్యాష్ షోకు వచ్చింది..

Shakeela సుమపై షకీలా అసహనం

shakeela fires on anchor suma

shakeela fires on anchor suma

తాజాగా సుమ షోలో షకీలా కాస్త అసహనం వ్యక్తం చేసింది. మామూలుగా అయితే షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో అందరూ డ్యాన్సులు వేస్తారు. అలానే షకీలాను కూడా స్టెప్పులు వేయమని సుమ అడిగింది. కానీ సుమకు షకీలా షాక్ ఇచ్చింది.క్యాష్ షో అని చెప్పారు.. ఇలా స్టెప్పులు వేయమంటారు? ఏంటి నేను వేయను వెళ్లిపోతోన్నాను డైరెక్టర్ కట్ చేయండి అని షకీలా హర్ట్ అయింది. దీంతో సుమ తెల్లమొహం వేసింది. ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోయింది. నా కొడుకుని పిలిస్తే వాడు వేస్తాడు అని చెప్పింది. మీకు కొడుకు ఎక్కడి నుంచి ఉన్నాడు?.. అని అనగానే సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp