Suma : మూడో బిడ్డ అందుకే క‌న‌లేక‌పోయా.. ఇన్నాళ్ల‌కి సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సుమ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suma : మూడో బిడ్డ అందుకే క‌న‌లేక‌పోయా.. ఇన్నాళ్ల‌కి సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సుమ‌

Suma : టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో సుమ ఒక‌రు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై మహారాణిలా ఓ వెలుగు వెలుగొందుతోంది. ముఖ్యంగా సినిమా ఈవెంట్లతో పాటు పలు షోలు చేస్తూ తెగ రచ్చ చేసే సుమ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ హంగామా చేస్తుంది. అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మైరైజ్ చేస్తూ.. ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా… తన […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2024,6:00 pm

Suma : టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో సుమ ఒక‌రు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై మహారాణిలా ఓ వెలుగు వెలుగొందుతోంది. ముఖ్యంగా సినిమా ఈవెంట్లతో పాటు పలు షోలు చేస్తూ తెగ రచ్చ చేసే సుమ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ హంగామా చేస్తుంది. అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మైరైజ్ చేస్తూ.. ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా… తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్లందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి వరుసగా వీడియోలు విడుదల చేస్తుంది.

Suma  సీక్రెట్ ఔట్..

కెరియర్ పరంగా టీవీలో షోలు చేస్తూ.. పిల్లలను చూసుకోకుండా ఉండడం కంటే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేలా సుమ ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అందుకే ఈ మ‌ధ్య సుమ అడ్డా షో తప్ప మరేవీ చేయకుండా.. యూట్యూబ్ పై ఫోకస్ చేసిందట. ఇక మిగతా సమయాల్లో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రమే వెళ్తుందట. గతంలో శనివారం ప్రసారం అయ్యే సుమ అడ్డా షో ఇప్పుడు మంగళవారం ప్రసారం అవుతోంది. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుద‌ల కాగా, ఈ ఎపిసోడ్ లో బుల్లితెర నటీనటులు సందడి చేస్తున్నారు. సుమ ఎప్పటిలాగే సుమ వారితో కలసి కామెడీ పంచ్ లతో నవ్వులు పూయించింది.

Suma మూడో బిడ్డ అందుకే క‌న‌లేక‌పోయా ఇన్నాళ్ల‌కి సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సుమ‌

Suma : మూడో బిడ్డ అందుకే క‌న‌లేక‌పోయా.. ఇన్నాళ్ల‌కి సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సుమ‌

ఓ బుల్లితెర నటి మాట్లాడుతూ.. తాము నటిస్తున్న సీరియల్ ముగిసిన తర్వాత బ్రేక్ దొరికింది. ఆ గ్యాప్ లో తాను నేను బాబుని కన్నాను.. అది పాపని కనేసింది.. వాడు బాబుని కన్నాడు అంటూ తన తోటి నటీనటుల్ని చూపిస్తూ ఫన్నీగా చెప్పింది. అంతే తమకి పిల్లల్ని కనే కనేందుకు కూడా చాలా తక్కువ గ్యాప్ దొరికినట్లు చెప్పింది. వెంటనే సుమ స్పందిస్తూ… ఇప్పుడు మీకు అర్థం అయింది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేశానో.. మూడో బిడ్డని కనాలనుకున్నా టైం లేదు అన్నట్లుగా చెప్పింది. వాళ్ళు టివి సీరియల్స్ తో బిజీ అయితే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో, టివి షోలతో తీరిక లేకుండా గడుపుతున్నానని సుమ పేర్కొంది. ప్ర‌స్తుతం సుమ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది