Shakeela : బిగ్ బాస్ 7 లోకి షకీలా.. హౌస్‌లో రచ్చ మామూలుగా ఉండదు ఇక

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 23, 2023, 9:30 am

Shakeela : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు అనే దానిపై పలు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అనే విషయం షో స్టార్ట్ అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకూడదు. అది బిగ్ బాస్ రూల్. అందుకే వెళ్లేవాళ్లు ఎవరు కూడా తాము బిగ్ బాస్ లోకి వెళ్తున్నామని చెప్పుకోరు.అయితే.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పేర్లలో అందరినీ షాకింగ్ కు గురి చేస్తున్న పేరు షకీలా. అవును.. తన గురించి తెలియాలంటే 90వ దశకంలో పుట్టిన కిడ్ ను అడిగితే తెలుస్తుంది.

షకీలాకు అప్పట్లో ఉన్న క్రేజే వేరు. ఈ తరం పిల్లలకు తన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ.. తను ఏంటో అప్పటి వాళ్లకు తెలుసు. షకీలాను బిగ్ బాస్ లోకి తీసుకుంటే ఇక రచ్చే ఉంటుందని బిగ్ బాస్ యాజమాన్యం భావించినట్టు తెలుస్తోంది. షకీలాతో పాటు పలువురు ఇతర కంటెస్టెంట్ల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న గ్రాండ్ లాంచ్ తో ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి 100 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు ఉంటారు. ఎంతమందిని ఈసారి తీసుకుంటున్నారు అనేది తెలియనప్పటికీ.. ఇది వరకు వచ్చిన ఆరు సీజన్ల కంటే కొత్తగా, వింతగా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో ఈసారి సీజన్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

shakeela to join in bigg boss telugu season 7 show

shakeela to join in bigg boss telugu season 7 show

Shakeela : సెప్టెంబర్ 3న బిగ్ బాస్ 7 గ్రాండ్ లాంచ్

బిగ్ బాస్ హౌస్ లోకి యూట్యూబర్ అనీల్ గీలా, కార్తీక దీపం శోభా శెట్టి, సీరియర్ హీరో అమర్ దీప్, ఆయన భార్య తేజస్విని జంటగా రాబోతున్నారట. అలాగే.. ఆట సందీప్, ఆయన భార్య కూడా వస్తారని అంటున్నారు. రంగస్థలం మహేశ్, ఒక ట్రాన్స్ జెండర్, మోహన భోగరాజు, జబర్దస్త్ తన్మయి పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి నిజంగా వీళ్లంతా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా లేదా అనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp