Shanmukh Jaswanth : ఆ ఒక్క సంచి షణ్ముఖ్ జశ్వంత్ ను ముంచేసిందిగా.. పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shanmukh Jaswanth : ఆ ఒక్క సంచి షణ్ముఖ్ జశ్వంత్ ను ముంచేసిందిగా.. పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనా ..?

 Authored By aruna | The Telugu News | Updated on :24 February 2024,3:15 pm

ప్రధానాంశాలు:

  •  Shanmukh Jaswanth : ఆ ఒక్క సంచి షణ్ముఖ్ జశ్వంత్ ను ముంచేసిందిగా.. పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనా ..?

Shanmukh Jaswanth : యూట్యూబ్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి సెలబ్రిటీ అయ్యారు. ఆయన చేసే పలు షార్ట్ ఫిలిమ్స్ కి అభిమానులు చాలామంది ఉన్నారు. ఇక దీప్తి సునైనాతో లవ్ బ్రేకప్ కావడం అతడికి పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక అప్పటినుంచి షణ్ముఖ్ జశ్వంత్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. పలుమార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఇరుక్కున్నారు. మద్యం తాగి ఒక కారుని ఢీకొనగా అతనిపై కేసు ఫైల్ అయింది. తర్వాత బెయిల్ తో బయటికి వచ్చారు. ఇక ఇప్పుడు ఇరుక్కున్న కేసులో ఆయన బయటకి రావడం చాలా కష్టమైన పరిస్థితి. అయితే షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్ వినయ్ సంపత్ పై ఒక అమ్మాయి కే కేసు పెట్టారు. మౌనిక అనే అమ్మాయి వినయ్ సంపత్ నన్ను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.

దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్ళగా ఫ్లాట్లో షణ్ముఖ్ జస్వంత్ గంజాయిని తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే గంజాయి కూడా కొద్ది మొత్తంలో అతడి ఫ్లాట్లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కొన్ని కేజీల మొత్తంలో గాంజాయిని షణ్ముఖ్ జశ్వంత్ తన దగ్గర ఉంచుకున్నాడని పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. గంజాయి అంతా ఒక సంచిలో ఉంటే దాని బరువు ఎంత అనేదాన్ని బట్టి కేసు ఉంటుంది. 20 కేజీలు కనుక ఉంటే అతడికి 10 సంవత్సరాల జైలు శిక్ష కచ్చితంగా పడుతుంది. అయితే అసలు 20 కేజీల గంజాయి ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అమ్మాయి కేసు మీద వెళ్ళగా షణ్ముఖ్ జస్వంత్ ఇలా గంజాయి త్రాగుతూ బుక్ అయ్యారు. ఇక అమ్మాయి వినయ్ సంపత్ తో పాటు షణ్ముఖ్ పై కూడా కేసు పెట్టింది.

యూట్యూబ్ ఛానల్స్ లో అవకాశం ఇస్తానని మోసం చేశారని ఆ తర్వాత వినయ్ సంపత్ తనను సెక్సువల్ గా హరాస్ చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో షణ్ముఖ్ మీద రెండు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఒకటి గంజాయి త్రాగుతూ కొద్ది మొత్తం గంజాయిని ఇంట్లో పెట్టుకోవడం రెండవది అమ్మాయిని యూట్యూబ్ ఛానల్ లో అవకాశాలు ఇస్తానని మోసం చేసాడని ఇలా రెండు కారణాలతో షణ్ముఖ్ పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ఇలా గాంజాయ్ కేసులో ఇరుక్కోవడం అభిమానులను కలిచి వేస్తోంది. షణ్ముఖ్ జస్వంత్ ఆ కేసునుండి త్వరగా బయటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ మరోసారి తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది