Maha Samudram Movie : మహాసముద్రం టీంకు షాకింగ్‌ న్యూస్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maha Samudram Movie : మహాసముద్రం టీంకు షాకింగ్‌ న్యూస్‌..!

Maha Samudram Movie :  మహా సముద్రం Maha Samudram  Review సినిమాపై ఎంతటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 వంటి చిత్రం తరువాత అజయ్ భూపతి చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో మామూలుగానే అంచనాలు ఉంటాయి. అదీ కాక సిద్దార్థ్ , siddharth , శర్వానంద్ , sharwanand, అదితి, అను ఇమాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్ ఇలా ఎంతో మంది భారీ తారాగణంతో రాబోతోండటంతో మహా సముద్రం మీద బజ్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :14 October 2021,8:30 am

Maha Samudram Movie :  మహా సముద్రం Maha Samudram  Review సినిమాపై ఎంతటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 వంటి చిత్రం తరువాత అజయ్ భూపతి చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో మామూలుగానే అంచనాలు ఉంటాయి. అదీ కాక సిద్దార్థ్ , siddharth , శర్వానంద్ , sharwanand, అదితి, అను ఇమాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్ ఇలా ఎంతో మంది భారీ తారాగణంతో రాబోతోండటంతో మహా సముద్రం మీద బజ్ బాగానే ఏర్పడింది. దీనికి తోడు ట్రైలర్లు, టీజర్, పాటలు బాగానే క్లిక్ అయ్యాయి.

Sharwanand Not Participated In Maha Samudram Promotions

Sharwanand Not Participated In Maha Samudram Promotions

దీంతో పాటు మహాసముద్రం విపరీతంగా ప్రమోషన్స్ చేసింది. అందులో ప్రతీచోట సినిమా గురించి దర్శకుడు ఎంతో నమ్మకంతో మాట్లాడాడు. బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈక్రమంలోనే సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సినిమా యూనిట్ అంతా కూడా బాగానే కష్టపడింది. ఈ క్రమంలో ట్రైలర్ ఈవెంట్‌లో శర్వానంద్, అజయ్ భూపతి, అను ఇమాన్యుయేల్ పాల్గొంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకొన్ని ప్రమోషన్స్‌లో సిద్దార్థ్, అదితీ, అజయ్ భూపతి వచ్చారు.

Sharwanand  శర్వాకు అనారోగ్యం..

sharwanand and siddharth maha samudram review and us live updates

కానీ సినిమా యూనిట్ అంతా మాత్రం ఎక్కడా ఒకేసారి రాలేదు. ఇక నిన్న మీడియాతో సినిమా యూనిట్ ముచ్చటించింది. ఇందులోనూ సిద్దార్థ్, అజయ్ భూపతి వచ్చారు. కానీ శర్వానంద్ రాలేదు. శర్వా రాలేకపోవడానికి కారణాన్ని కూడా సిద్దు వివరించాడు. శర్వాకు ఫీవర్ వచ్చింది.. ఆరోగ్యం బాగా లేదు. అందుకే రాలేకపోయాడు. శర్వా రాకపోయిన ఆయన మనసు మాత్రం ఇక్కడే ఉంటుందని అన్నాడు. మొత్తానికి చివరి సమయంలో శర్వాకు ఇలా జరగడంతో టీం మొత్తం షాక్ తిన్నట్టుంది.

మహా సముద్రం రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది