Sharwanand : పెళ్లయిన సింగర్ పై మోజు పడ్డ శర్వానంద్ .. ఆ పనికి కూడా సిద్ధమైపోయి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sharwanand : పెళ్లయిన సింగర్ పై మోజు పడ్డ శర్వానంద్ .. ఆ పనికి కూడా సిద్ధమైపోయి ..!

 Authored By aruna | The Telugu News | Updated on :28 September 2023,5:00 pm

Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శర్వానంద్ ఈ మధ్యనే తాను ప్రేమించిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇక ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. శర్వానంద్ కి ‘ గమ్యం ‘ సినిమా నుంచి మంచి హిట్ వచ్చింది. అయితే శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ సింగర్ పై మోజు పడ్డారట. కానీ ఆ సింగర్ కి అప్పటికే పెళ్లయిపోయిందట.

కానీ పెళ్లయిపోయిందని తెలిసిన కూడా ఆ సింగర్ తో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగించారని అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఆ సింగర్ ఎవరో కాదు స్మిత. సీనియర్ సింగర్ స్మిత కేవలం సింగర్ గానే కాకుండా కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఇక సింగర్ స్మిత కి శర్వానంద్ కి ఓ ఈవెంట్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త నెంబర్స్ మార్చుకునే వరకు వెళ్లిందట. గంటలకొద్దీ వీరు ఫోన్లో మాట్లాడుకునేసరికి ఇద్దరి మధ్య ప్రేమ పీక్స్ కి వెళ్ళిపోయిందని తెలిసింది. ఇక శర్వానందుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన స్మిత తన భర్తకి విడాకులు ఇవ్వటానికి సిద్ధమైపోయిందట.

Hero sharwanand love story

Hero sharwanand love story

అంతేకాదు శర్వానంద్ కూడా తన ఇంట్లో స్మితని పెళ్లి చేసుకుంటానని గొడవ పెట్టారట. కానీ ఆమెకు అప్పటికే పెళ్లయిపోవడంతో శర్వానంద్ ని ఇంట్లోని వాళ్ళు కట్టడి చేశారట. ఇక స్మిత తన భర్తతో విడాకులు తీసుకుంటున్న విషయాన్ని దాసరి నారాయణరావు, నాగేశ్వరరావు వంటి సీనియర్ లు, ఇండస్ట్రీలోని పెద్దలు వారిద్దరినీ పిలిపించి సింగర్ స్మిత కి గడ్డి పెట్టి తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైన పెళ్లి బంధాన్ని మంచి దూరం చేసుకుంటావా అని మంచి మాటలు చెప్పారు. దాంతో తాను చేసిన తప్పును గ్రహించిన స్మిత శర్వానంద్ ను దూరం పెట్టి తన భర్తతో సంతోషంగా వివాహ బంధాన్ని కంటిన్యూ చేస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది