Nani Sharwanand : నాని, శర్వానంద్ ఆ ఇద్దరు లెజెండరీ ఫ్రెండ్స్ పాత్రలో.. గూస్ బంప్స్ స్టఫ్..!
ప్రధానాంశాలు:
Nani Sharwanand : నాని, శర్వానంద్ ఆ ఇద్దరు లెజెండరీ ఫ్రెండ్స్ పాత్రలో.. గూస్ బంప్స్ స్టఫ్..!
Nani Sharwanand : న్యాచురల్ స్టార్ నాని, శర్వానంద్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా ఇద్దరు గొప్ప స్నేహితుల కథతో వస్తే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. నాని, శర్వానంద్ లు కలిసి నటించడమే క్రేజీ మల్టీస్టారర్ అవుతుంది అనుకుంటే ఆ ఇద్దరు కలిసి దర్శక రచయితలైన బాపు రమణల జీవిత కథతో వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దర్శకుడిగా బాపు.. రచయితగా ముళ్లపూడి వెంకట రమణ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇద్దరు ఒకే జట్టుగా అలా చేస్తూ వచ్చారు. అలా పట్టుకున్న చేయి చివరి వరకు వీడలేదు. దర్శకుడిగా బాపు.. రచయితగా రమణ ఇద్దరు ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ షిప్ ని కొనసాగిస్తున్నారు. ఐతే ఈ ఇద్దరు స్నేహితుల జీవిత కథతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
Nani Sharwanand బాపు, రమణల బయోపిక్..
ఐతే ఈ ఇద్దరి తెరరూపానికి నాని, శర్వానంద్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. బాపు, రమణల బయోపిక్ కు నాని, శర్వానంద్ అయితే అదిరిపోతుందని చెప్పుకుంటున్నారు. ఐతే ఇందులో ఎవరు బాపు, ఎవరు వెంకట రమణ అన్నది తెలియదు కానీ ఇద్దరు కలిసి చేస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ కి వేరే లెవెల్ క్రేజ్ వస్తుంది.
నాని, శర్వానంద్ ఇద్దరు తెలుగు సినిమాలకు కొత్త కథలు అందించాలని చూస్తారు. అలాంటి ఈ ఇద్దరు బాపు రమణల కోసం కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే మాత్రం తెర మీద ఒక అద్భుత కళాకండాన్ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు దర్శకుడు సాయి మాధవ్ కాబట్టి రైటింగ్ మీద మంచి పట్టు ఉంటుంది. మరి ఈ సినిమా నిజంగా ఉంటుందా లేదా గాలి వార్తలేనా అన్నది తెలియాల్సి ఉంది. Nani Sharwanand for Bapu Ramana Biopic