WWW Movie Review : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ రివ్యూ.. అదరగొట్టేసిన రాజశేఖర్ కూతురు శివానీ !

WWW Movie Review : రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా 118 వంటి సూప‌ర్‌హిట్ మూవీని తెరకెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో “WWW”(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా చేసింది. ఇందులో గరుడ వేగ ఫేమ్ అదిత్‌ అరుణ్ హీరో. రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. తెలుగులో వ‌స్తున్న ఫ‌స్ట్ కంప్యూట‌ర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావ‌డం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రోజు(డిసెంబ‌రు24) నుంచి సోనిలీవ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.

ఈ కథ అంతా కూడా లాక్డౌన్ నేపథ్యంలోనే జరుగుతుంది. లాక్డౌన్ కాలంలో మనం అంతా కూడా ఆన్ లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్‌లు అనేవి వింటూ వచ్చాం. అయితే ఈ కథను కూడా అలాంటి నేపథ్యంలోనే తెరకెక్కించారు. విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) నలుగురు మంచి స్నేహితులు, సాఫ్ట్ వేర్ టెకీలు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. చిష్ట్రీ ద్వారా విశ్వ‌కి మిత్ర ప‌రిచ‌యమ‌వుతుంది. ఒక సారి మిత్ర ఫ్యామిలీకి.. విశ్వ హెల్ప్ చేస్తాడు. దాంతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. మిత్ర ఒక రోజు చిష్ట్రీ ఇంటికి వెళుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు?, విశ్వ‌ని ఎందుకు ఉరివేసుకుని చావ‌మ‌న్నాడు. ఆ వ్య‌క్తి నుండి విశ్వ మిత్ర‌, చిష్ట్రిల‌ను కాపాడాడా లేదా అనేది మిగ‌తా సినిమా క‌థ‌..

Shivani Rajashekar Adith Arun WWW Review And Rating inTelugu

300 చిత్రాల‌కు పైగా సినిమాటోగ్రాఫ‌ర్ గా వ‌ర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి. గుహన్… తీసే కథలన్నీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చాలా డిఫరెంట్ గా ఉండి… ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకుంటాయి. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని తల్లిదండ్రులకు తెలిసేలా ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు గుహ‌న్‌. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విష‌యం. ఎంతో ఎగ్జైటింగ్ అనిపించే ఇలాంటి కథలను అనుకున్న బడ్జెట్ లోనే తెరమీద రిచ్ గా చూపించొచ్చని గుహన్ నిరూపించారు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.

ఇక పెర్‌ఫామెన్స్‌ల విష‌యానికి వ‌స్తే ఇందులో ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ గా నటించిన అదిత్ అరుణ్… మరోసారి తన మార్క్ స్టయిలిష్ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. అతనికి జంటగా నటించిన శివాని రాజశేఖర్ కూడా ఓ సిన్సియర్ ప్రేమికురాలిగా బాగా నటించింది. సినిమా అంతా కంప్యూట‌ర్ స్క్రీన్ మీద‌నే న‌డుస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌తి ఎక్స్‌ప్రెష‌న్ ఆడియ‌న్స్ క్యాచ్ చేసే విధంగా ఎంతో అనుభ‌వ‌మున్న న‌టి అనేలా న‌టించింది. సాంగ్స్‌లో చాలా క్యూట్ గా కనిపించింది. ఇక ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అస‌లు సిస‌లు థ్రిల్ ను ప‌రిచ‌యం చేశాడు. వైవా హర్ష… త‌న‌ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు.

సాంకేతిక విలువ‌ల విష‌యానికి వ‌స్తే ఈ చిత్రానికి గుహ‌న్ మేకింగ్ తో పాటు సినిమాటోగ్ర‌ఫి కూడా చాలా ప్ల‌స్ అయింది. కొన్ని స‌న్నివేశాల్లో విజువ‌ల్స్ గూజ్‌బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. త‌ర్వాత మాట్లాడుకోవాల్సింది సైమన్‌ కె. కింగ్ సంగీతం, నేప‌థ్య సంగీతం గురించి.. క‌థ ఎక్క‌డా డీవియేట్ కాకుండా త‌న బీజియమ్‌తో ఆక‌ట్టుకుంటూనే పాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. అన్ని పాట‌లు స్క్రీన్ మీద ప్ల‌జెంట్‌గా ప్రొజెక్ట్ చేయ‌బ‌డ్డాయి. తమ్మిరాజు క్రిస్పి ఎడిటింగ్ బాగుంది..ఇక రామంత్ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌ల్ని త‌ప్ప‌కుండా మెచ్చుకోవాల్సిందే..ఈ క‌థ‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే విని మొద‌టిసినిమాగా ఒక డిఫ‌రెంట్ చిత్రాన్ని ఎంచుకోవ‌డం గొప్ప విష‌యం. ఖ‌ర్చుకి ఎక్క‌డా వెన‌కాడ‌కుండా క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టుల్ని సాంకేతిక వ‌ర్గాన్ని ఎంపిక‌చేసుకోవ‌డంతోనే ఈ టీమ్ స‌క్సెస్ సాధించింది. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా క‌థాబ‌లం ఉన్న చిత్రాలు, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా మ‌రింత బాగ న‌చ్చుతుంది.

Recent Posts

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

33 minutes ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

3 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

4 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

4 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

5 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

5 hours ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

6 hours ago