Home » Entertainment » Rashmi Gautam Demands Huge Remuneration For Item Song In Chiranjeevi Movie Bholashankar
Entertainment

Rashmi Gautam : చిరంజీవితో స్పెషల్ సాంగ్ కి రష్మీ గౌతమ్ ఎన్ని లక్షలు డిమాండ్ చేసిందో తెలుసా..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 24, 2021 10:35 am
Advertisement

Rashmi Gautam : బుల్లితెరపై దూసుకుపోతూ టాప్ ఫిమేల్ యాంకర్లలో ఒకరిగా రష్మీ గౌతమ్ స్థిర పడిపోయింది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో యాంక‌ర్‌గా ఉన్న ఈమెకు యూత్ లో క్రేజ్ మామూలుగా లేదు. అయితే మొదట హీరోయిన్ గా చేద్దామని వచ్చిన రష్మీ అవకాశాలు లేక యాంకర్ గా మారింది. గ్లామర్ తో బాగా పాపులర్ అయిన అనంతరం ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి గుంటూరు టాకీస్ మూవీతో హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే తన కెరియర్ కు ఉపయోగపడ్డ జబర్దస్త్ షో ను మాత్రం ఆమె పక్కన పెట్టకుండా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మడికి మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసే ఆఫర్‌ వచ్చింది.

Advertisement

అయితే ఈ సాంగ్ కు గానూ ర‌ష్మీ తీసుకుంటున్న రెమ్మ్యూనరేషన్ తాలూకు ఓ విషయం నెట్టింట వైరల్ గా మారింది.భోళాశంక‌ర్ సెకండాఫ్‌లో వచ్చే మాస్ మసాలా సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పు లేసెందుకు గాను రష్మీ రూ.75 లక్షలు డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది. చిరుతో అవకాశం రావడమే అదృష్టంగా భావించే నటీమణులు ఉన్న ఈ కాలంలో.. కేవలం ఐదు నిమిషాల సాంగ్ కోసమే రష్మీ ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఏంటని నెటిజన్లు అంటున్నారు. రష్మీ గుంటూరు టాకీస్ సినిమా చేసినందుకు గాను అప్పట్లోనే రూ. 30 ల‌క్ష‌లు ఛార్జ్ చేసిందట. అయితే అది పూర్తి సినిమా కాగా ఇప్పుడు కేవలం ఓ ఐటెం సాంగ్ కు ఆమె అందుకు రెట్టింపుగా డిమాండ్ చేసిందట.

rashmi gautam demands huge remuneration for item song in chiranjeevi movie bholashankar

Advertisement

Rashmi Gautam : 5 నిమిషాల పాటకు రూ.75 లక్షలా..!

ఏది ఏమైనప్పటికి చిత్ర బృందం కూడా రష్మీ అడిగినంత ఇచ్చేందుకే మొగ్గు చూపారని సమాచారం. మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుండగా… ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారని తెలుస్తోంది.చెల్లెలి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆయన జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి