Shivathmika : బ్లాక్ క‌ల‌ర్ శారీలో సెగ‌లు పుట్టిస్తున్న శివాత్మిక‌.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shivathmika : బ్లాక్ క‌ల‌ర్ శారీలో సెగ‌లు పుట్టిస్తున్న శివాత్మిక‌.. !

 Authored By sandeep | The Telugu News | Updated on :31 May 2022,4:30 pm

Shivathmika : శివాత్మిక రాజశేఖర్.. ఇటీవ‌లి కాలంలో తెగ ర‌చ్చ చేస్తుంది. సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాతో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచారు. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన దొరసాని కమర్షియల్ గా ఆడలేదు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా ఇదే మొదటి చిత్రం. ట్రాజిక్ లవ్ స్టోరీ కావడం వలన ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు. క్రిటిక్స్ నుండి ప్రసంశలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద దొరసాని ఫెయిల్ అయ్యింది.శివాత్మిక పెద్ద‌గా సినిమాల‌లోను సంద‌డి చేయ‌డం లేదు. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ఈ మూవీ ఆకాశం అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇక దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.ఇటీవ‌లి కాలంలో శివాత్మిక సోష‌ల్ మీడియాలో చేస్తున్న సంద‌డి మాములుగా లేదు.

shivathmika cute looks are crazy

shivathmika cute looks are crazy

Shivathmika : శివాత్మిక సంద‌డి..

మైమ‌ర‌పించే అందాల‌తో మెంట‌లెక్కిస్తుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ శారీలో కేక పెట్టించే విధంగా ఉంది శివాత్మిక‌. ఇలా శివాత్మిక‌ని చూసి థ్రిల్ అవుతున్నారు. ముద్దుగుమ్మ‌కి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. అది అలా ఉంటే శివాత్మిక ఎవరితోను లేచిపోయిందని ఇటీవ‌ల‌ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. శివాత్మిక తన ప్రియుడితో దుబాయ్ వెళ్లినట్లు టాక్ నడిచింది. అయితే ఈ విషయంలో శివాత్మిక స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరితోను వెళ్లిపోలేదని.. తన పేరేంట్స్‌తోనే దుబాయ్ వచ్చానంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. రూమర్స్ అంటే కొంతలో కొంత అయిన నమ్మశక్యంగా ఉండాలంటూ.. ఇలాంటీ రూమర్స్ నమ్మవద్దంటూ ఓ పోస్ట్ చేశారు

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది