Shriya Saran : రాజమౌళి ఆ వ్యాధితో విపరీతంగా బాధపడుతున్నారా… అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్ శ్రియ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shriya Saran : రాజమౌళి ఆ వ్యాధితో విపరీతంగా బాధపడుతున్నారా… అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్ శ్రియ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 December 2022,10:30 am

Shriya Saran : దర్శకుడు రాజమౌళి పేరు కేవలం మనదేశంలోనే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. బాహుబలి సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆ తర్వాత ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ స్థాయిని మరింత పెంచాడు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియన్ సినిమా గౌరవాన్ని ఇతర దేశాలలో కూడా విస్తరింప చేశాడు. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టాలీవుడ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. ఆర్ఆర్అర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఈ సినిమా జపానీస్ లో కూడా విడుదలై భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా అంత తేలికగా ఎం పూర్తి కాలేదు. ఈ సినిమా వెనుక జక్కన్న ఎంత కష్టపడ్డారో హీరోయిన్ శ్రియ తెలియజేసింది. సాధారణంగానే జక్కన్న తన సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. ఇక జక్కన్న సినిమా అంటే దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు పడుతుందని అందరికీ తెలిసిందే. మరి అన్నేలు కష్టపడితే కానీ అంత మంచి సినిమా రాదు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో జక్కన్న ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.

Shriya Saran who revealed Rajamouli disease

Shriya Saran who revealed Rajamouli disease

ఇక ఈ విషయాన్ని హీరోయిన్ శ్రియ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ముందు నుండే జక్కన్న ఆస్తమాతో బాధపడుతున్నారట. అలాగే సెట్స్ లో ఎంత దుమ్ము ఉన్నా సరే అలాగే పని చేసేవారట. వెండితెరపై సినిమాను అద్భుతంగా చూపించడానికి జక్కన్న బాగా తాపత్రయపడతారని హీరోయిన్ శ్రియ వెల్లడించింది. అందుకే ఆర్ఆర్అర్ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రికార్డులను సొంతం చేసుకుందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు సన్సెట్ సర్కిల్ అవార్డులో అంతర్జాతీయ చిత్రంగా విజయం అందుకుంది. ఇక ఆస్కార్ లెవెల్ లో కూడా త్రిబుల్ ఆర్ ఉందని సమాచారం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది