Home » Entertainment » Shyam Singha Roy Nani About On Sai Pallavi
Entertainment

Shyam Singha Roy : సాయిపల్లవిని చూడగానే తనకు ఆ ఫీలింగ్ కలిగిందన్న నాని..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 18, 2021, 5:00 pm
Advertisement

Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో హీరో నాని, హీరోయిన్స్ సాయిపల్లవి, కృతిశెట్టి పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నాని..సాయిపల్లవితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ నాని సాయిపల్లవి గురించి ఏమన్నారంటే..‘వకీల్ సాబ్’ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఎంసీఏ’ ఫిల్మ్‌లో నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ వీరిరువురు జంటగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించారు.ఇకపోతే తనకు సాయిపల్లవిని చూడగానే తన ఇంట్లో మనిషిలాగా అనిపిస్తుందని, తన కుటుంబ సభ్యుల్లో ఒకరిలా సాయిపల్లవి ఉంటుందని నాని అన్నారు.

Advertisement

Shyam Singha Roy Nani About on Sai Pallavi

ఈ క్రమంలోనే తాను, సాయిపల్లవి ‘ఎంసీఏ’ పిక్చర్ షూటింగ్ సమయంలో ఏదేని విషయాలపై డిస్కస్ చేసుకునేవారమని గుర్తు చేసుకున్నారు నాని. ఏ డౌట్ వచ్చినా వెంటనే అడిగేసేవారమని నాని, సాయిపల్లవి తెలిపారు. తనకు హీరోయిన్ సాయిపల్లవిని చూడగానే ఇంట్లో మనిషన్న ఫీలింగ్ కలిగిందని, పల్లవితో తాను ఫార్మల్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపాడు నాని. తన ఇంట్లో మనిషితో ఎలా మాట్లాడానో పల్లవితో అలానే మాట్లాడుతానని నాని పేర్కొన్నాడు. పల్లవితో సినిమా విషయమై కాకుండా వేరే విషయాలపైన కూడా మాట్లాడుకున్నామని, ఎంసీఏ సినిమా టైంలో సాంగ్ షూట్ కోసం యూరప్ వెళ్లినపుడు తాను, పల్లవి, పల్లవి వాళ్ల చెల్లెలు పూజ హ్యాపీగా టైం స్పెండ్ చేశామని నాని చెప్పాడు. హ్యాపీ అండ్ స్పెషల్ మెమొరీగా ఆ టైం ఉంటుందని అన్నాడు.

Advertisement

Shyam Singha Roy : రెండో సారి జతకట్టిన నాని, సాయిపల్లవి..

ఇక ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సాయిపల్లవి దేవదాసి పాత్రను పోషించింది. డ్యాన్సర్‌గా ఈ సినిమాలో సాయిపల్లవి విశ్వరూపం చూపించబోతున్నదని విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతున్నది. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి