Shyamala Devi : అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. అందరిని ఆహ్వానిస్తామంటూ ప్రభాస్ పెద్దనాన్న ప్రకటన..!
ప్రధానాంశాలు:
Shyamala Devi : అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. అందరిని ఆహ్వానిస్తామంటూ ప్రభాస్ పెద్దనాన్న ప్రకటన..!
Shyamala Devi : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ల లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. తన తోటి వాళ్లందరు పెళ్లిళ్లు చేసుకుంటుండగా, ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి జోలికి వెళ్లడం లేదు.. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44. ఇప్పుడు ఆయన ఎంత సేపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు, ఆడియెన్స్‌కు ఎంటర్‌టైనమెంట్ అందించాలనే కానీ.. పెళ్లి చేసుకుందాం అనే థాట్ కూడా రావడం లేదని పలువురు డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో కూడా ఉన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సైతం తను ఉన్నన్ని రోజులు ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచించేవాడట. ఘనంగా పెళ్లి చేయాలని అనుకునేవాడట. కానీ.. ఆ ముచ్చట తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Shyamala Devi గుడ్ న్యూస్..
ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. గతేడాది పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చినా.. ప్రచారానికే పరిమితమైంది. తాజాగా కృష్ణం రాజు భార్య శ్యామల దేవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు శ్యామల దేవి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు. దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయం సన్నిధిలో నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామల దేవి కి ఆలయ అర్చకులు ఆశీర్వచనం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం శ్యామలా దేవి మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ దర్శనానికి రావటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఆలయానికి వస్తానని.. కృష్ణం రాజు గారికి దుర్గమ్మ అంటే చాలా ఇష్టమని ఇక్కడికి వస్తే ఆయనే గుర్తుకి వస్తారని అన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, దానికి స్పందించిన శ్యామలా దేవి.. ‘తల్లి ఆశీస్సులున్నాయి. కృష్ణం రాజు గారి ఆశీస్సులు కూడా బాబుపై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లి అవుతుంది. మీరందరూ చూస్తారు. ఆరోజు మీడియాను ఆహ్వానిస్తాం’ అని తెలిపారు. తాను ఎప్పుడు రాజకీయాల్లోనే ఉన్నానని.. బీజేపీ అధిష్టానం ఏ పదవి ఇచ్చిన సంతోషంగా నిర్వహిస్తానని చెప్పారు.