Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు… అభిమానుల్లో ఆనందం
ప్రధానాంశాలు:
Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు... అభిమానుల్లో ఆనందం
Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండియన్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ లాంటి అద్భుత విజయం తర్వాత ప్రభాస్ సౌత్ సినిమాలనే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కూడా దోచుకున్నాడు.

Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు… అభిమానుల్లో ఆనందం
Shyamala Devi : పెళ్లికి వేళాయే..
ఇటీవల, ప్రభాస్ వ్యక్తిగత జీవితంపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి. మీడియాతో మాట్లాడిన ఆమె, “ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అతడి పెళ్లి జరగాలి అని నాకెంతో ఆకాంక్ష ఉంది. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే, అదే సమయంలో అతని పెళ్లి జరుగుతుంది,” అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నాకు తెలిసినంతవరకూ అతడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు శ్యామలాదేవి చెప్పిన ప్రకారం, ప్రభాస్ పెళ్లి గురించి కుటుంబంలో చర్చలు జరుగుతున్నాయనే స్పష్టత కూడా కనిపిస్తోంది. తన కుటుంబం సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రభాస్ డెసిషన్ తీసుకుంటాడని శ్యామలాదేవి అన్నారు. “ప్రతి విషయాన్ని శివుడి ఆశీస్సులతోనే మేము చేపడతాం. ప్రభాస్ విషయంలో కూడా అదే. వేడుకలు జరగాలంటే కాలం కుదరాలి. కానీ ఆ రోజు దగ్గరలోనే ఉంది అనే నమ్మకమున్నది,” అని ఆమె అన్నారు.
ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్‌కు తప్పకుండా పెళ్లి చేయాలనుందని తెలిపిన శ్యామలాదేవి
శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి జరుగుతుందని వెల్లడి pic.twitter.com/JL1AuIAjTS
— BIG TV Breaking News (@bigtvtelugu) August 11, 2025