Mangli : సింగర్ మంగ్లీ ఆదాయం.. పదేళ్ల క్రితం, ఇప్పుడు ఎంతో మార్పు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangli : సింగర్ మంగ్లీ ఆదాయం.. పదేళ్ల క్రితం, ఇప్పుడు ఎంతో మార్పు

 Authored By aruna | The Telugu News | Updated on :29 September 2022,10:30 am

Mangli : సింగర్ మంగ్లీ… ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతిభ, అదృష్టం ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని ఈమెని చూస్తే అర్థమవుతుంది. అదృష్టం ఒక్కటే ఉంటే అందలం ఎక్కడం కష్టం.. ప్రతిభ కూడా ఉండి అదృష్టం తోడైతేనే అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. మంగ్లీ విషయంలో అదే జరిగింది. ఎక్కడో 5000 రూపాయల నెల వారి జీతం తీసుకుని ఉద్యోగం చేసుకునే మంగ్లీ అనూహ్యంగా ఒకానొక సమయంలో వి6 ఛానల్ లో జాబ్ చేసే ఒక అతనికి కనిపించడం ఏంటి.. అతడి ఆహ్వానం మేరకు ఆ చానల్లో తీన్మార్ అనే వార్త కార్యక్రమంలో పాల్గొనడం ఏంటి.

లంబాడ జాతికి చెందిన ఆమెను సరికొత్తగా ఆ ఛానల్ వారు చూపించడంతో పాటు ఆమెలో ఉన్న గాయనిని అద్భుతంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. ఆ ఛానల్ లో మంగ్లీ జాయిన్ అయిన సమయంలో నెలకు పది వేల రూపాయల జీతం ఇచ్చేవారని సమాచారం, చాలా తక్కువ సమయంలోనే మంగ్లీ ఎంతో మంది అభిమానంను సొంతం చేసుకుంది. తన గొంతుతో తన యొక్క బాడీ లాంగ్వేజ్ తో తన యొక్క ఉత్సాహపరిచే మాట తీరుతో ఆమె తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. దానికి తోడు ఆమె పాటలు ఒక్కొక్కటిగా సక్సెస్… సూపర్ హిట్.. బ్లాక్‌ బస్టర్ అన్నట్లుగా అవుతూ వచ్చాయి. దాంతో హీరోయిన్ స్థాయి ఆమెకు దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Singer Mangli Income Compare to then and Now

Singer Mangli Income Compare to then and Now

స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఆమె పాట తమ సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారంటే ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె ఒక్క పాట పాడితే 5 లక్షల రూపాయలు తీసుకుంటుంది, ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక యూట్యూబ్లో ఆమె ఒక్క వీడియో పోస్ట్ చేస్తే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇంతగా ఆమె సంపాదిస్తుంది అంటే ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం పట్టుదల ప్రతిభ వీటన్నిటికీ తోడు ఒకింత అదృష్టం. కనుక ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఏదో ఒక సమయంలో అదృష్టం తోడై మంగ్లీ మాదిరిగా విజయం సాధిస్తారు ఆల్ ది బెస్ట్.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది