Mangli : స‌ద్గురు ఈవెంట్‌లో పాట పాడిన మంగ్లీ.. తెగ డ్యాన్స్ లు చేసిన పెళ్లి సంద‌డి హీరోయిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangli : స‌ద్గురు ఈవెంట్‌లో పాట పాడిన మంగ్లీ.. తెగ డ్యాన్స్ లు చేసిన పెళ్లి సంద‌డి హీరోయిన్

 Authored By sandeep | The Telugu News | Updated on :2 March 2022,7:00 pm

Mangli : మంగ్లీ .. ఒక‌ప్పుడు ఈవిడ కొంత మందికి మాత్ర‌మే సుప‌రిచితం.ఇప్పుడు మంగ్లీ అంటే ప్ర‌తి ఒక్క‌రు గుర్తు ప‌డ‌తారు. జాన‌ప‌ద పాట‌ల‌తో కెరీర్‌ను ప్రారంభించి త‌న గొంతుతో కోట్లాది మంది ఫాలోవ‌ర్లను సంపాదించింది యువ గాయ‌ని మంగ్లీ. అల వైకుంఠ‌పురం చిత్రంలో మంగ్లీ పాడిన రాములో రాములా పాట ఏ రేంజ్‌లో రికార్డు సృష్టించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ త‌ర్వాత లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ‌ద‌రియా పాట వ్యూస్ పంట పండించింది. ఈ సింగింగ్ సెన్సేష‌న్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల మంగ్లీ పాడిన ఏ పాట అయిన సెన్సేష‌న్ క్రియేట్ చేయాల్సిందే. త‌న వాయిస్‌తో సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్న‌ మంగ్లీ కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తోంది.

భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జ‌ర‌గ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ న‌టీమ‌ణులు కూడ పాల్గొన్నారు. అయితే మంగ్లీ త‌న పాట‌తో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. శివుడి పాట‌ను అద్భుతంగా పాడ‌డంతో ప్ర‌గ్యా, శ్రీ లీల వంటి అందాల భామ‌లు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయారు. వారికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గత సంవత్సరం సద్గురు ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ లో ప్రసారమైన శివరాత్రి వేడుకలను సుమారుగా 100 మిలియన్లకు ప్రజలు వీక్షించారు. ఈ ఈవెంట్ ను లాస్ట్ ఇయర్ లైవ్ స్ట్రీమింగ్ ను 20 మిలియన్ల ప్రజలు వీక్షించారు. గతేదాది ఆ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ లో అగ్రగామిగా నిలిచింది.

Sri leela dance for mangli song

Sri leela dance for mangli song

Mangli : మంగ్లీ మ‌జాకా..

ఇక శ్రీలీల విష‌యానికి వ‌స్తే ఈ అమ్మడు పెళ్లి సంద‌డి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ జాబితాలో ఆమె చేరిపోయింది. రాఘవేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో తనదైన అభినయం, అందచందాలతో అట్రాక్ట్ చేసింది.అందంతో పాటు అంతకు మించిన చలాకీతనం ఉన్న శ్రీ లీలను హీరోయిన్‌గా తీసుకోవడానికి చాలామంది దర్శకనిర్మాతలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్, మెగా హీరోతో కూడా ఈ అమ్మ‌డు సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది