Siddharth: వ‌రుణ్ తేజ్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ బొమ్మ‌రిల్లు సిద్దార్థ్‌.. ఇలా క‌న్‌ఫాం చేశాడా?

Authored By Sam C | The Telugu News | Published on: July 20, 2022, 10:00 pm

Siddharth: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో సిద్ధార్థ్. ఇందులో ఈ హీరో న‌ట‌న చాలా మందికి తెగ న‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత సిద్ధార్థ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే ఇటీవ‌ల సిద్ధార్థ్ సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. చైతూ కంటే ముందు సమంత.. సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగించిందని వార్తలొచ్చాయి. సిద్ధార్థ్‌ కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేసింది సమంత. అంతేకాదు సిద్ధార్థ్‌, సమంత కలిసి `జబర్దస్త్` సినిమాలో నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్య లవ్‌ బాగా పెరిగిందని, వీరిద్దరు మ్యారేజ్‌ కూడా చేసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సడెన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు.

Siddharth: ఇలా బ‌య‌ట‌ప‌డ్డారు…

ఇప్పుడు సిద్థార్థ్ .. అదితిరావు హైద‌రితో ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తాను నిరూపించుకుంటోంది. అదితి చివరగా మహాసముద్రం అనే క్రేజీ మూవీలో నటించింది. ఈ చిత్రంలో అదితి రావు.. హీరో సిద్దార్థ్ కి జంటగా నటించడం విశేషం. తాజాగా వీరిద్దరూ జంటగా ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాకి చిక్కారు. దీంతో త్వ‌ర‌లో విరిద్ద‌రు పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయం అని తెలుస్తుంది.

siddharth relation with aditi rao

siddharth relation with aditi rao

అదితి రావుకి ఆల్రెడీ పెళ్ళై 2013లో బ్రేకప్ జరిగింది. సిద్దార్థ్ కూడా తన భార్య నుంచి విడిపోయి సింగిల్ గా ఉన్నాడు. దీనితో వీరి మధ్య కొత్త ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరూ కెమెరాకి జంటగా ఫోజులు ఇచ్చేందుకు నిరాకారించినట్లు తెలుస్తోంది. ముందుగా అదితి సెలూన్ నుంచి వచ్చి కారు ఎక్కింది. ఆ తర్వాత సిద్దార్థ్ అదే కారులో ఎక్కాడు. దీంతో అంద‌రిలో అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp