Siddharth : మొన్నటి వరకు చాలా సైలెంట్‌గా ఉన్న హీరో సిద్దార్థ్ ఈ మధ్య ట్విట్టర్‌లో కాంట్రవర్సీ అయ్యేలా పోస్టులు పెడుతున్నాడు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత సిద్దార్థ్ చేస్తున్న ట్వీట్‌లు వీరి విషయాన్నే ప్రస్తావిస్తున్నట్టు నెటిజన్స్ అభిప్రాయం. బాయ్స్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్దార్థ్.. బొమ్మరిల్లు మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఆయనకు పెద్దగా హిట్స్ దక్కలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ మూవీలో తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు సిద్దార్థ్.
శర్వానంద్‌తో కలిసి మహాసముద్రం అనే మూవీలో యాక్ట్ చేశాడు. ఈ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోసైతం ప్రస్తుతం ఉన్న మెయిన్ టాపిక్స్‌లో నాగచైతన్య, సమంత డివోర్స్ ఇష్యూ సైతం ఒకటి. వాస్తవానికి వీరు దూరమై నెలలు గడుస్తున్నా.. ఈ విషయంపై ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది. విడిపోయాక అప్పటి నుంచి సామ్ ట్విట్టర్ వేదికగా పలు కామెంట్స్ చేస్తోంది. నాగ చైతన్యతో సామ్ విడాకులు కన్ఫార్మ్ అయ్యాక సిద్దార్థ్ చేసిన ఓ ట్విట్ పెద్ద దుమారమే లేపింది. మోసం చేసిన వారు బాగుపడరని, ఆ విషయం స్కూల్ లో టీచర్ చెప్పిందని అంటూ పోస్ట్ చేశాడు
ప్రస్తుతం ఆయన చేసిన మరో ట్వీట్ సైతం చర్చకు దారి తీసింది. అయితే సమంతను ఉద్దేశిస్తూనే సిద్దార్థ్ ఈ కామెంట్స్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ట్వీట్ చేసిన కొంత వ్యవధిలోనే సిద్దార్థ్ సైతం ట్వీట్ చేయడం గమనార్హం. విషపూరితమైన సోషల్ మీడియాలో కొంతమంది స్టార్స్ తమ ఫ్యాన్స్ నిర్వహించే గ్రూప్ లను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. లాస్ట్ కు ఫ్యాన్స్ తిరిగి వారిని కాటేస్తారని వారు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రేమను, ద్వేషాన్ని కొనుక్కోవడం మానుకోండి అని ట్వీట్ చేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.