Siddharth : ప్రేమను, ద్వేషాన్ని కొనుక్కోవడం ఇప్పుడైనా మానాలి.. స‌మంత‌ను ఉద్దేశిస్తూ సెన్సెషనల్ కామెంట్స్ చేసిన‌ సిద్దార్థ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Siddharth : ప్రేమను, ద్వేషాన్ని కొనుక్కోవడం ఇప్పుడైనా మానాలి.. స‌మంత‌ను ఉద్దేశిస్తూ సెన్సెషనల్ కామెంట్స్ చేసిన‌ సిద్దార్థ్ ..!

 Authored By mallesh | The Telugu News | Updated on :9 December 2021,5:00 pm

Siddharth : మొన్నటి వరకు చాలా సైలెంట్‌గా ఉన్న హీరో సిద్దార్థ్ ఈ మధ్య ట్విట్టర్‌లో కాంట్రవర్సీ అయ్యేలా పోస్టులు పెడుతున్నాడు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత సిద్దార్థ్ చేస్తున్న ట్వీట్‌లు వీరి విషయాన్నే ప్రస్తావిస్తున్నట్టు నెటిజన్స్ అభిప్రాయం. బాయ్స్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్దార్థ్.. బొమ్మరిల్లు మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఆయనకు పెద్దగా హిట్స్ దక్కలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ మూవీలో తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు సిద్దార్థ్.

శర్వానంద్‌తో కలిసి మహాసముద్రం అనే మూవీలో యాక్ట్ చేశాడు. ఈ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోసైతం ప్రస్తుతం ఉన్న మెయిన్ టాపిక్స్‌లో నాగచైతన్య, సమంత డివోర్స్ ఇష్యూ సైతం ఒకటి. వాస్తవానికి వీరు దూరమై నెలలు గడుస్తున్నా.. ఈ విషయంపై ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది. విడిపోయాక అప్పటి నుంచి సామ్ ట్విట్టర్ వేదికగా పలు కామెంట్స్ చేస్తోంది. నాగ చైతన్యతో సామ్ విడాకులు కన్ఫార్మ్ అయ్యాక సిద్దార్థ్ చేసిన ఓ ట్విట్ పెద్ద దుమారమే లేపింది. మోసం చేసిన వారు బాగుపడరని, ఆ విషయం స్కూల్ లో టీచర్ చెప్పిందని అంటూ పోస్ట్ చేశాడు

siddharth tweet goes viral samantha

siddharth tweet goes viral samantha

Siddharth : సమంత, నాగచైతన్య విషయమేనా?

ప్రస్తుతం ఆయన చేసిన మరో ట్వీట్ సైతం చర్చకు దారి తీసింది. అయితే సమంతను ఉద్దేశిస్తూనే సిద్దార్థ్ ఈ కామెంట్స్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ట్వీట్ చేసిన కొంత వ్యవధిలోనే సిద్దార్థ్ సైతం ట్వీట్ చేయడం గమనార్హం. విషపూరితమైన సోషల్ మీడియాలో కొంతమంది స్టార్స్ తమ ఫ్యాన్స్ నిర్వహించే గ్రూప్ లను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. లాస్ట్ కు ఫ్యాన్స్ తిరిగి వారిని కాటేస్తారని వారు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రేమను, ద్వేషాన్ని కొనుక్కోవడం మానుకోండి అని ట్వీట్ చేశాడు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది