Siddhu Jonnalagadda : మ‌రోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు.. ఏం జ‌రిగింది అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Siddhu Jonnalagadda : మ‌రోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు.. ఏం జ‌రిగింది అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2025,5:34 pm

ప్రధానాంశాలు:

  •  Siddhu Jonnalagadda : మ‌రోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు.. ఏం జ‌రిగింది అంటే..!

Siddhu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న చివ‌రిగా న‌టించిన డీజే టిల్లు స్వ్కేర్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇందులో రొమాంటిక్ సీన్స్ చాలా మందిని ఆక‌ట్టుకున్నాయి. సిద్ధు న‌టిస్తున్న తాజా సినిమా ‘జాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ సాంగ్ విడుదల చేశారు.

Siddhu Jonnalagadda మ‌రోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు ఏం జ‌రిగింది అంటే

Siddhu Jonnalagadda : మ‌రోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు.. ఏం జ‌రిగింది అంటే..!

Siddhu Jonnalagadda సిద్ధు క్లారిటీ..

‘భాగ్య నగరం అంతా మనదే మనదే.. నీ బాధే తీరుస్తా పదవే పదవే.. జంటై పోదాం అందే పెదవే పెదవే.. దునియాతో పనిలేదింకా పదవే పదవే ..’ అంటూ మొదలైన ఈ పాటకు ముందు వచ్చిన సీన్ చూస్తే.. హీరోయిన్ హీరోను ముద్దు అడగటం అందుకోసం అతనికి ఎక్కడా సరైన స్థలమే దొరకలేదు అని చెబుతూ నగరం అంతా సరైన ప్లేస్ కోసం తిరుగుతూ ఉండగా వచ్చే పాటలా ఉంది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్ో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సిద్ధూకి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి

కిస్ కోసం ఎప్పుడైన వెతికారా అని అడిగిన‌ప్పుడు టిల్లు స్కేర్‌లో నేను అయితే ఎక్క‌డ వెత‌క‌లేదు. ఇక్క‌డ కూడా వెతుకుతున్నా అనే నమ్మ‌కం లేదు. నేను వెత‌క‌ను జాక్ వెతుకుతూ ఉంటుంది అని సిద్ధు బ‌దులిచ్చాడు. ఈ సినిమాలో మంచి సీక్వెన్స్ లతో పాటు డ్యాన్స్ లు కూడా బాగా కంపోజ్ చేస్తాడు రాజు సుందరం. అతనితోనే కొరియోగ్రఫీ చేయించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ గీతాన్ని సనరే రాశారు. జావేద్ అలీ, అమలా చేబోలు కలిసి పాడారు. సింపుల్ గా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. కాస్ట్యూమ్స్ బావున్నాయి. వైష్ణవి చైతన్య పూర్తిగా చీరలోనే ఉండటం బలే అనిపిస్తుంది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది