Jack Trailer Review : జాక్ ట్రైలర్ రివ్యూ.. సిద్దు జొన్నలగడ్డ మరో కామెడీ థ్రిల్లర్ మాములుగా లేదు..!
ప్రధానాంశాలు:
Jack Trailer Review : జాక్ ట్రైలర్ రివ్యూ.. సిద్దు జొన్నలగడ్డ మరో కామెడీ థ్రిల్లర్ మాములుగా లేదు..!
Jack Trailer Review : సిద్దు జొన్నలగడ్డ siddu jonnalagadda వరుస చిత్రాలతో ప్రేక్షకులతో అలరిస్తున్న విషయం తెలిసిందే. టిల్లు బ్రాండ్ తో హైదరాబాద్ పోరడిగా చేసిన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ఇపుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో Jack Movie ‘జాక్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీకి కొంచెం క్రాక్ అనేది ఉప శీర్షిక. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. జాక్ ఓ స్పై గా నటిస్తున్నట్టు చూపించాడు.

Jack Trailer Review : జాక్ ట్రైలర్ రివ్యూ.. సిద్దు జొన్నలగడ్డ మరో కామెడీ థ్రిల్లర్ మాములుగా లేదు..!
Jack Trailer Review అదిరిపోయింది…
తన గూఢచర్యం కోసం రకరకాల వేషాలు వేస్తుంటాడు. అది ఈ ట్రైలర్ లో చూపించాడు. మన దేశంలో నాలుగు చోట్ల టెర్రరిస్టులు బాంబులు పెట్టారనే ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో హీరో తన టీమ్ తో కలిసి ఎలాంటి ఆపరేషన్ చేసి దేశ ద్రోహుల ఆట కట్టించాడనేడనేదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ ను దాటి హాస్యంతో పూర్తి ఎంటర్టేనర్ గా తెరకెక్కించాడు.
టెర్రిరిస్టులను, డ్రగ్స్ పట్టుకోవడానికి ప్రకాశ్ రాజ్, జాక్ ఇద్దరు వారి ఆపరేషన్లలో ఇన్వాల్ అవుతాడు. మీరు ఎందుకు లేట్ వచ్చారని జాక్ అడిగితే.. నీకు ఎలాంటి పర్మిషన్స్ అక్కర్లేదు. మాకు పీఎం, ఇతర అధికారుల అనుమతి కావాల్సి ఉంటుంది అంటాడు. అయితే నాది ఆపరేషన్ బటర్ ఫ్లే అని జాక్ అంటే.. నాది ఆపరేషన్ రెడ్ థండర్ అని ప్రకాశ్ రాజ్ సమాధానం ఇస్తాడు. దాంతో థండర్ ఎక్కడైనా రెడ్‌గా ఉంటుందా? అని మరోసారి జాక్ సెటైర్ వేస్తాడు. ఇది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
