Siddu Jonnalagadda | టిల్లు గాడి లైఫ్‌లో రియల్ లవ్ స్టోరీ.. విని నోరెళ్లపెడుతున్న నెటిజన్స్
Siddu Jonnalagadda | తన లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ . ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేను కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నాను. 7వ తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డాను. కానీ, ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి చెప్పలేదు. పదవ తరగతి కూడా అయిపోయింది. స్కూల్ చివరి రోజు శ్లామ్ బుక్ తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లాను. అందులో తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ రాసి, ఒక లుక్ ఇచ్చి, సైకిల్ పై వెళ్లిపోయింది.
#image_title
మనోడు ముదురే..
ఆ క్యూట్ విజువల్ ఇంకా క్లియర్ గుర్తుంది. కొన్నేళ్లకు ఆ అమ్మాయికి పెళ్లయి, పిల్లలు కూడా పుట్టారు. నేరుగా మాట్లాడకపోయినా, అప్పుడప్పుడు ఇనస్టాగ్రామ్ లో తన ప్రొఫైల్ చూస్తుంటాను. అలా తనకు పెళ్లయి, పిల్లలున్నారనే విషయం తెలిసింది”అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు.
ఇక సిద్దు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తెలుసు కదా అనే సినిమా చేస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోన తెరకెక్కిస్తుండగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.