Silk Smitha : వెండితెరపై గ్లామర్ ఇమేజ్ సొంతం చేసుకున్ననటి సిల్క్ స్మిత. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించిన విషయం తెలిసిందే. సిల్క్ స్మిత ఆత్మహత్య సినీ ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చింది. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత హఠాన్మరణం అనేకమంది సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. అనేక సినిమాలలో సిల్క్ ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టాయి. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా” పాట ఇప్పటికే హాట్ హాట్ సాంగ్ అనే చెప్పాలి.సినిమాలలోకి వచ్చిన కొత్తలో సిల్క్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసేది.
ఆమెను చూసి ఓ దర్శకుడి భార్య చాలా అందంగా ఉందని చెప్పడంతో సైడ్ డ్యాన్సర్ గా అవకాశం అందుకుంది. ఆ తరవాత తన లుక్స్ తో మగవాళ్లకు మత్తెక్కించడంతో వరుస ఆఫర్ లను అందుకుంది. స్టార్ హీరోలు సైతం తన డేట్స్ కోసం వేచి చూసే స్థాయికి సిల్క్ స్మిత ఎదిగింది. అవకాశాలు తగ్గుముఖం పట్టడం అయినవాళ్లే మోసం చేయడంతో చివరికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ సిల్క్ చివరికి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుని ఈ లోకానికి దూరం అయ్యింది. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్, సిల్క్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి మొదటిసారి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు.
సిల్క్ తన జీవితంలోని అన్ని విషయాలను తనతో పంచుకునేదని రవిచంద్రన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చనిపోయే ముందురోజు కూడా సిల్క్ తనకు ఫోన్ చేసిందని రవిచంద్రన్ తెలిపారు. కానీ తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని చెప్పారు. మామూలు కాల్ అనుకుని తాను తిరిగి ఫోన్ కూడా చేయలేదని అన్నారు.తాను ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్రతికి ఉండేదేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.1996 సెప్టెంబర్ 23 న, స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయింది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను బలి తీసుకుందని అన్నవారు కూడా లేకపోలేదు
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.