Singer Kanakavva : సింగర్ కనకవ్వ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారు.. షో కి హాజరైతే ఎంత?
Singer Kanakavva : ఈ మధ్య కాలంలో జానపదం అనగానే ఎక్కువగా కనకవ్వ పేరు వినిపిస్తుంది. ఆమె పల్లెటూరు పాటలను ఎంతో వినసొంపుగా పాడుతూ అభిమానులను సొంతం చేసుకుంది. చదువురాకున్నా కూడా ఒక అద్భుతమైన గాత్రం తో తన యొక్క గానామృతాన్ని ఎంతో మందికి పంచుతున్న కనకవ్వ ఆరు పదుల వయసు దాటిన తర్వాత సెలబ్రెటీ హోదా దక్కించుకోవడంతో పాటు మంచి ఆదాయంను సొంతం చేసుకుంటుంది. ఆమె ప్రతిభకు ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువే అన్నట్లుగా ఆమెతో పాటలు పాడించే వారు చాలా మంది అంటూ ఉంటారు. మంగ్లీ యాంకర్ గా వ్యవహరించిన
ఒక కార్యక్రమం ద్వారా కనకవ్వ పరిచయం అయ్యింది. ఆ సమయంలో రెండు నుండి మూడు వేల రూపాయల పారితోషికం తీసుకున్న కనకవ్వ ఇప్పుడు ఒక్క పాటకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుంది. ఆమె పాట అంటే జనాల్లో ఉన్న ఆధరణ కు తగ్గట్లుగా మంచి పారితోషికం అయితే ఆమె తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆమె యొక్క పాటలు అన్నీ కూడా యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. కనుక ఆమె లక్షల్లో పారితోషికం తీసుకునే అర్హత ఉన్న గాయినీ అనడంలో సందేహం లేదు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాల్లో
కూడా కనకవ్వ కనిపిస్తూ ఉంటుంది. తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా కనకవ్వ సందడి చేసిన విషయం తెల్సిందే. అలా ఒక్క రోజు లేదా హాఫ్ డే కాల్షీట్ కు కూడా కనకవ్వ మినింగా 50 వేల వరకు తీసుకుంటూ ఉంటుందట. ఆమె స్టేజ్ పై కనిపించింది అంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. అందుకే ఆ స్థాయిలో పారితోషికం ఆమెకు ఇవ్వడం లో తప్పు లేదు.. ముందు ముందు ఆమె పారితోషికం మరింతగా పెరగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ వయసులో కూడా ఒక స్టార్ సెలబ్రెటీ అయిన పల్లెరత్నం కనకవ్వ ఎంతో మందికి ఆదర్శం.