Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ స్టెప్పులు.. పరువుతీసిన సింగర్ మనో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ స్టెప్పులు.. పరువుతీసిన సింగర్ మనో

 Authored By prabhas | The Telugu News | Updated on :12 June 2022,7:00 pm

సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి.. బుల్లితెరపై స్టార్‌గా ఎదిగాడు. వెండితెరపై హీరోగా రాణించేందుకు బాగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఇంత వరకు సరైన సినిమా పడలేదు. హీరోగా స్టార్ స్టేటస్‌ను తెచ్చుకోలేకపోతోన్నాడు. ఇంత వరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవిచూశాయి. అలా సుధీర్ నటించిన త్రీ మంకీస్, సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా మారిపోయాయి. అందుకే మధ్యలో బుల్లితెరపై ఎక్కువగా ఫోకస్ పెట్టేశాడు.

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలతో బిజీగా మారిపోయాడు.కానీ సుధీర్ మాత్రం వీటిల్లోంచి మెల్లి మెల్లిగా బయటకు వచ్చేశాడు. జబర్దస్త్ షోను ఎట్టి పరిస్థితుల్లో వీడనంటూ సుధీర్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. కానీ పరిస్థితులన్నీ ఒకేలా ఉండవని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు సుధీర్ మొత్తానికే ఈటీవీకి దూరంగా ఉండిపోయాడు. ముందుగా ఢీ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి వచ్చేశాడు. ఇక చివరకు శ్రీదేవీ డ్రామా కంపెనీకి కూడా రాంరాం చెప్పేశాడు. అయితే మల్లెమాల నుంచి పూర్తిగా విడిపోయిన సుధీర్.. స్టార్ మాలోకి జంప్ అయ్యాడు. తనకేదో సినిమా ఆఫర్లు వచ్చాయని, టైం లేక షోలు చేయడం లేదంటే ఒకలా ఉండేది..

Singer Mano Staires On Sudigali Sudheer In Star Maa Junior Super Singer Programme

Singer Mano Staires On Sudigali Sudheer In Star Maa Junior Super Singer Programme

కానీ ఇక్కడ మానేసి అక్కడ చేరిపోయాడు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. విబేధాల వల్లే సుధీర్ ఇలా స్టార్ మాకు వెళ్లాడని అంటున్నారు. ఇక సింగర్ మనో సైతం స్టార్ మా సింగింగ్ షోకు జడ్జ్‌గా వెళ్లాడు. అయితే అక్కడ అనసూయ,సుధీర్, మనోలు బాగానే సందడి చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో సుధీర్ తన కంటెస్టెంట్‌తో, అనసూయ తన కంటెస్టెంట్‌తో కలిసి స్టెప్పులు వేశారు. సుధీర్ ఎంతో కష్టపడి వేసిన స్టెప్పులపై మనో కౌంటర్ వేశాడు. సొరంగంలో దూరినట్టుంది అంటూ సెటైర్ వేశాడు. ఏంటి సార్ అలా అంటారు.. ఎంతో కష్టపడి వేశాను అని సుధీర్ కవర్ చేసుకుంటాడు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది