Singer Sunitha : అందుకే నీకు పెళ్లి కావడం లేదు.. యాంకర్ ప్రదీప్‌పై సింగర్ సునీత

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 11, 2021, 8:00 pm

Singer Sunitha :  బుల్లితెరపై ఎక్కువగా యాంకర్ ప్రదీప్ పెళ్లి ప్రస్థావన వస్తుంటుంది. ఆయన పెళ్లి విషయంపై ప్రతీ ఒక్క సెలెబ్రిటీ కామెంట్లు చేస్తుంటారు. ఇక ఆయన చేసే షోల్లో అయితే పెళ్లి మీద కౌంటర్లు పడుతూనే ఉంటాయి. ప్రియమణి, శేఖర్ మాస్టర్, ఆది, సుధీర్, రష్మీ ఇలా అందరూ కూడా ప్రదీప్ పెళ్లి గురించి సెటైర్లు వేస్తూనే ఉంటారు. అందరికంటే ఎక్కువగా సుమ పంచ్‌లు వేస్తుంటారు. కానీ ఇప్పుడు డ్రామా జూనియర్స్ పిల్లలు కూడా ప్రదీప్‌ను ఆడుకుంటున్నారు.

Singer Sunitha On Anchor Pradeep Marriage

Singer Sunitha On Anchor Pradeep Marriage

డ్రామా జూనియర్స్ షోను ఇప్పుడు ప్రదీప్ ముందుండి నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అలీ, కృష్టారెడ్డి, సునీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా సమయం సందర్భం దొరికితే ప్రదీప్ పెళ్లి మీద కౌంటర్లు వేస్తుంటారు. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో సింగర్ సునీత్ ప్రదీప్ పరువుతీసింది. అందుకే నీకు పెళ్లి కావడం లేదంటూ అందరి ముందే సునీత అనేసింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

Singer Sunitha : యాంకర్ ప్రదీప్‌పై సింగర్ సునీత

ఓ బుడ్డోడు అమ్మాయిలపై స్కిట్ వేశాడు. అమ్మాయిలు డేంజర్ అంటూ పవన్ కళ్యాణ్ కొట్టే డైలాగ్‌తో స్కిట్ వేశాడు. దీనిపై సునీత స్పందిస్తూ.. అమ్మాయిలను అంటావా? ఇక్కడ ఇంత మంది ఉన్నారు.. బయటకు ఎలా వెళ్తావ్ అని బుడ్డోడిని బెదిరించింది. అయితే వెంటనే ప్రదీప్ అందుకుని.. నేను అన్నది అమ్మాయిల గురించి అని చెప్పురా? అని బుడ్డోడిని ఉసిగొల్పాడు. ఆ మాటతో సునీత షాకై.. ఇది మరీ డామేజింగ్ స్టేట్మెంట్.. అందుకే నీకు పెళ్లి కావడం లేదు అని సునీత సెటైర్ వేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp