Anchor Pradeep : పెద్ది కి స్పెషల్ థాంక్స్ చెప్పిన యాంకర్ ప్రదీప్ .. ఎందుకంటే !
ప్రధానాంశాలు:
Anchor Pradeep : పెద్ది కి స్పెషల్ థాంక్స్ చెప్పిన యాంకర్ ప్రదీప్ .. ఎందుకంటే !
Anchor Pradeep : బుల్లితెరపై తన ప్రత్యేక యాంకరింగ్ శైలితో విశేష ప్రేక్షకాదరణ పొందిన ప్రదీప్ మాచిరాజు, ఇప్పుడు మరోసారి వెండితెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ‘‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్, ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ అనే టైటిల్‌తో వస్తున్న తాజా సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Anchor Pradeep : పెద్ది కి స్పెషల్ థాంక్స్ చెప్పిన యాంకర్ ప్రదీప్ .. ఎందుకంటే !
Anchor Pradeep : మహేష్ & రామ్ చరణ్ లకు థాంక్స్ చెప్పిన యాంకర్ ప్రదీప్
ఈ సినిమాను జబర్ధస్త్ ఫేమ్ నితిన్, భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రదీప్ సరసన బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి కథానాయికగా నటించనుండగా, ఇది ఆమెకు తొలి సినిమా కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కలిగించాయి. తాజాగా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్రదీప్, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇద్దరూ సినిమా గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చాడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమాలో ఓ సివిల్ ఇంజినీరింగ్ యువకుడు, తన స్నేహితుడితో కలిసి పల్లెకు వెళ్లి ఎదుర్కొనే సమస్యలు, గ్రామస్తుల మధ్య పరిస్థితులు, అక్కడి ఒకే ఒక అమ్మాయి కోసం జరిగే పరిణామాలు కథానాయికతో కలసి ఎలా మలుపులు తిరుగుతాయనే కథాంశం ఆసక్తికరంగా ఉండనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ వినోదభరిత చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది.