Anchor pradeep Jr Ntr : ఎన్టీఆర్- ప్రదీప్ మధ్య ఇంత క్లోజ్‌నెస్సా.. మలేషియాకి తీసుకెళ్లి మరి..!
ప్రధానాంశాలు:
Anchor pradeep Jr Ntr : ఎన్టీఆర్- ప్రదీప్ మధ్య ఇంత క్లోజ్‌నెస్సా.. మలేషియాకి తీసుకెళ్లి మరి..!
Anchor pradeep Jr Ntr : యాంకర్ ప్రదీప్ కొన్నాళ్ల పాటు టీవీలో స్టార్ యాంకర్ గా అందర్నీ మెప్పించాడు. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరో అవతారం ఎత్తాడు. ఇక ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో పలకరించబోతున్నాడు. ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన సినిమా ఏప్రిల్ 11న రాబోతుంది.

Anchor pradeep Jr Ntr : ఎన్టీఆర్- ప్రదీప్ మధ్య ఇంత క్లోజ్‌నెస్సా.. మలేషియాకి తీసుకెళ్లి మరి..!
Anchor pradeep Jr Ntr అంత క్లోజా..
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రదీప్ యాంకర్ సుమ చాట్ షోకి వచ్చాడు. ఈ షోలో అనేక అంశాలు మాట్లాడాడు. ఎన్టీఆర్ ప్రస్తావన రాగా ప్రదీప్.. ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమాలో నటించాను. ఆఫ్ సెట్స్ ఆయన హ్యూమర్ చాలా బాగుంటుంది. నాకు షూట్ లేకపోయినా, అది సాంగ్ షూట్ అయినా మూవీ వాళ్లకు చెప్పి నన్ను మలేషియా తీసుకెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. ఎన్టీఆర్ అన్న చాలా సరదాగా, అల్లరిగా ఉంటారు. మలేషియాకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ అన్న.. మా అమ్మగారు మీ షో చూస్తారు ప్రదీప్.
టీవీలో నీ వాయిస్ వినిపిస్తే వంటింట్లో ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నీ షోలు చూస్తారు అని చెప్పారు. అప్పట్నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయనవి ఏ షూటింగ్ జరిగినా నేను వెళ్తాను. ఆయనతో కబుర్లు చెప్తాను. ఆయనతో కాస్త సమయం గడుపుతాను. నాకు ఆ చనువు ఉంది ఆయన దగ్గర అని తెలిపాడు ప్రదీప్.