Single Movie : ట్రైలర్ వివాదం.. మంచు ఫ్యామిలీ కి క్షేమపణలు చెప్పిన యంగ్ హీరో..!
Single Movie : టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా ట్రైలర్ చుట్టూ వివాదం చెలరేగింది. ఈ ట్రైలర్‌లో హీరో శ్రీవిష్ణు “శివయ్య” అని పిలిచే డైలాగ్ మరియు “మంచు కురిసిపోయింది” అనే డైలాగ్ లు వివాదాస్పదంగా మారాయి. ప్రేక్షకులు ఈ డైలాగ్‌లను కేవలం వినోద పరంగా చూసినా, మోహన్ బాబు కుటుంబానికి దగ్గరగా ఉన్న వారు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘కన్నప్ప’ సినిమా టీమ్ ఈ ట్రైలర్‌ను తమ సినిమాపై చేసిన సైటైర్ గా భావిస్తోంది.
Single Movie : ట్రైలర్ వివాదం.. మంచు ఫ్యామిలీ కి క్షేమపణలు చెప్పిన యంగ్ హీరో..!
‘కన్నప్ప’ సినిమాలో హీరో విష్ణు చెప్పిన డైలాగ్‌ను ‘సింగిల్’ ట్రైలర్‌లో వ్యంగ్యంగా వాడారని, ఇది మోహన్ బాబు కుటుంబాన్ని అవమానించినట్లుగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. “మంచు కురిసిపోయింది” అనే డైలాగ్ కూడా మోహన్ బాబు ఇంటిపేరు “మంచు”పై ఆటలు ఆడినట్లుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ట్రైలర్ విడుదల అనంతరం మోహన్ బాబు, విష్ణు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ట్రైలర్‌లోని కొన్ని దృశ్యాలు మరియు డైలాగ్‌లు ఉద్దేశపూర్వకంగా చూసేలా ఉన్నాయని, ఇవి మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ వివాదం వేడెక్కడంతో హీరో శ్రీవిష్ణు స్పందిస్తూ.. మోహన్ బాబు కుటుంబాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశం ఎప్పుడూ తనకు లేదని స్పష్టం చేశారు. “ఇది కేవలం వినోదం కోసమే చేయబడిన ట్రైలర్” అంటూ ఆయన చెప్పినప్పటికీ, ఏవైనా వ్యాఖ్యలు మోహన్ బాబు గారిని లేదా వారి కుటుంబాన్ని బాధించాయంటే తాను హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు. మరి శ్రీవిష్ణు సారీ తో శాంతిస్తారా లేదా అనేది చూడాలి. అయితే శ్రీవిష్ణు ఫ్యాన్స్ మాత్రం విష్ణుకు సారీ చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.