TDP Janasena : కేంద్రం పై టీడీపీ - జనసేన ఒత్తిడి.. చంద్రబాబు - పవన్ ప్లాన్ అదేనా..?
TDP Janasena : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 175 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా, విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపు అవకాశం ఉంది. తెలంగాణాకు 119 సీట్లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 50 సీట్లు పెంచే వీలుందని అప్పట్లోనే నిర్ణయం తీసినప్పటికీ, ఇప్పటివరకు అది అమలుకాకపోవడం గమనార్హం. గతంలో టీడీపీ పాలనలో సీట్ల పెంపుపై ప్రయత్నాలు చేసినా, కేంద్రంలోని ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడంతో ఆ ప్రస్తావన నిలిచిపోయింది. తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అంశంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో, 2024 వరకు మూడు ఎన్నికలు జరగినా సీట్ల సంఖ్య యథాతథంగా ఉంది.
TDP Janasena : కేంద్రం పై టీడీపీ – జనసేన ఒత్తిడి.. చంద్రబాబు – పవన్ ప్లాన్ అదేనా..?
ప్రస్తుతం తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ – జనసేన కూటమి ఈసారి సీట్ల పెంపుపై గట్టి ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు పార్టీల్లోనూ అధిక సంఖ్యలో నాయకులు ఉన్న నేపథ్యంలో అందరికి పదవులు కేటాయించాలంటే సీట్ల పెంపు అవసరమవుతుంది. కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ, తమ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి 225 సీట్లు వరకూ పెంచే అవకాశం ఉన్నా, టీడీపీ ఆశయమైతే అదనంగా మరో 25 సీట్లు కూడా పెంచుకుని 250 సీట్లు చేయాలన్నదే.
ఇక జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రతీ రెండు లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ సీటు లెక్కన చూస్తే 250 సీట్లు రావచ్చన్న వాదనతో టీడీపీ వర్గాలు కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రానికి కూడా బలమైన మిత్రులుగా ఉన్న టీడీపీ – జనసేన కూటమి బలపడితే, జమిలీ ఎన్నికల సమయానికి ఇది బీజేపీకీ ఉపయోగపడొచ్చన్నది కేంద్ర పెద్దల ఆలోచన. ఈ క్రమంలో 2026 నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో కేంద్రం చూడాలి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.