Shanmukh : మంచి పేరు తెచ్చుకుంటే చాలట!.. ఇజ్జత్ తీసుకుంటున్న సిరి, షన్ను
Shanmukh : బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడమే సవాలు. అక్కడ వారు చేసే పనులు జనాలకు ఎలా వెళ్తున్నాయో వారికి తెలియదు. ఏదో చేస్తున్నామని అనుకుంటారు.. ఇంకేదో అవుతుంది. మంచి పేరు తెచ్చుకుందామని అనుకుంటారు. కానీ చెడ్డ పేరును మూటగట్టుకుంటారు. అలా సిరి, షన్నులకు ఇప్పుడు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. కానీ ఈ ఇద్దరికీ తమ ఇమేజ్ ఎలా ఉందో తెలియదు.
బిగ్ బాస్ ఇంట్లో హగ్గులు,ముద్దులు తప్పా ఇంకేమీ చేయని ఈ నిబ్బ బ్యాచ్.. మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారట. బిగ్ బాస్ ఇంట్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి.. బయటకు వెళ్లాక మంచి పేరు రావాలి.. వెళ్లేటప్పుడు మనం మనలానే ఉండాలి అంటూ నీతులు చెప్పుకున్నారు షన్ను, సిరి. అదేదో అన్నట్టుగా చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ఆ పనులు అన్నట్టుగా వీరి వ్యవహారం తయారైంది.

Siri And Shanmukh Gets Negative Image In Bigg Boss 5 Telugu
Shanmukh : రెచ్చిపోతోన్న సిరి, షన్ను..
ఆగలేకపోతోన్నట్టుగా సిరి బరి తెగించే విధానంతో చండాలమైన కారెక్టర్‌గా మిగిలిపోయింది. ఇక షన్ను తనలోని శాడిజాన్ని చూపిస్తూ జనాల దృష్టిలో కమెడియన్ అయిపోయాడు. సిరి వేరే వాళ్లతో క్లోజ్‌గా ఉంటే అస్సలు తట్టుకోలేడు షన్ను. అలా సిరిని కంట్రోల్ చేసేందుకు షన్ను బాగానే ట్రే చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో కూడా హగ్గులా రామాయణం మాత్రం మారలేదు.
#Shanmukh serious in roleplay…Mistake evaridi?#BiggBossTelugu5 tomorrow at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/HfYy7G3Ljw
— starmaa (@StarMaa) December 7, 2021