Bigg Boss 5 Telugu : నువ్ ఏం పీకుతావ్.. సిరిపై షన్ను కామెంట్స్

Authored By aruna | The Telugu News | Published on: October 22, 2021, 12:20 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం సిరి, షన్ను, జెస్సీలకు దిమ్మతిరిగి పోయింది. సీక్రెట్ టాస్క్ ఇస్తే చేజేతులా నాశనం చేసుకున్నాడు జెస్సీ. టాస్క్ ఉద్దేశ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక విఫలమయ్యాడు. జెస్సీ మాత్రమే కాకుండా తనతో పాటు సిరి, షన్నులు కూడా మునిగిపోయారు. సిరి తన సీక్రెట్ టాస్క్‌లో భాగస్వామిని చేసుకున్నాడు జెస్సీ. ముగ్గురి దగ్గర జీరో ఎగ్స్ చేసేందుకు సిరి, జెస్సీలు ప్రయత్నించారు. అందులో భాగంగా షన్నుని సిరి కన్విన్స్ చేసింది.

Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu

Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu

అలా మొత్తానికి సిరి మాట విని షన్ను బంగారు కోడిపెట్ట అనే టాస్కుకు ఆడకుండా మానేశాడు. అందరి కంటే ఎగ్స్ ఎక్కువగా దొరకబట్టినా కూడా సిరి చెప్పిందని వదిలేశాడు. అయితే చివరకు సీక్రెట్ టాస్క్ తుస్సుమంది. సిరి, షన్ను, జెస్సీలకు పెద్ద బొక్క పడింది. అయితే అంతకు ముందే సిరికి సంబంధించిన స్టిక్కర్లను ఎవరో దొంగిలించారు. అలా సిరి ఎగ్స్ కూడా సంపాదించుకోలేకపోయింది. అయితే వాటిని అలా దొంగించింది ఎవరో మాత్రం తెలియడం లేదు.

Bigg Boss 5 Telugu :  సిరి, షన్నుల మధ్య గొడవ

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu

దీనిపై షన్ను, సిరి చర్చించుకున్నారు. నా స్టిక్కర్లు తీసింది ఎవరో తెలియడం లేదు అని సిరి అనడం, రవి తీశాడా? అని షన్ను ప్రశ్నించాడు. ఏమో తెలియదని సిరి చెప్పింది. నేను తీశాను.. నేను తీస్తే ఏం చేస్తావ్ ఏం పీకుతావ్ అని సిరిని ధమ్‌కి ఇచ్చాడు షన్ను. ఏం పీకను.. ఏం చేస్తానో చూస్తావ్ అని షన్నుకు సిరి కౌంటర్ వేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో షన్ను ఎంతగా అలిగాడో.. సిరి ఎంతలా కూల్ చేసేందుకు ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. కానీ షన్ను మాత్రం ఇంకా మారాం చేస్తూనే వచ్చాడు.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp