Bigg Boss 5 Telugu : బాత్రూంలో సిరి, షన్నుల రచ్చ.. నిబ్బ బ్యాచ్ అంటూ ట్రోల్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : బాత్రూంలో సిరి, షన్నుల రచ్చ.. నిబ్బ బ్యాచ్ అంటూ ట్రోల్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :17 November 2021,2:10 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల వ్యవహారం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి బాగానే ఉంటారు. మళ్లీ కాసేపటికే మారిపోతుంటారు. ఎందుకు గొడవ పెట్టుకుంటారు? ఎందుకు అలా దూరంగా ఉంటారు.. మళ్లీ ఎందుకు దగ్గరవుతారు.. ఎందుకు ఆ హగ్గులు.. ఆ ముద్దులెందుకు అన్నది ఎవ్వరికీ అర్థం కాదు. ఇదంతా పుటేజ్ కోసం చేస్తున్నారా? అంటే అది కూడా అర్థం కాదు. నిన్న మాత్రం షన్ను, సిరి చేష్టలు చూసి విసుగెత్తిపోయారు అంతా.

సిరి, షన్నుల మధ్య చిన్న గొడవలే అవుతాయి. కానీ అది మాత్రం వేరే లెవెల్‌కు వెళ్తుంది. నిన్నటి టాస్కుల్లో సిరి తన మాట వినలేదు అనో.. లేదంటే శ్రీరామచంద్రతో క్లోజ్‌గా ఉందనో.. అసలు కారణం ఏంటో తెలియదుగానీ ఈ ఇద్దరూ చిన్న పిల్లల చేష్టలు చేశారు. దీపు ఉంటే బాగుండేది.. నేను ఒంటరి అనే ఫీలింగ్ వస్తోంది.. తను ఉంటే నేను రాజులా మారిపోతాను అని ఏదేదో అన్నాడు. షన్ను ఎంత వద్దన్నా, ఎంత ఈసడించుకున్నా కూడా సిరి మాత్రం బంకమట్టిలా పట్టుకుంది. షన్నుని వదలడం లేదు.

Siri And Shannu Gets Trolling For ThierTrack In Bigg Boss 5 Telugu

Siri And Shannu Gets Trolling For ThierTrack In Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu : సిరి, షన్నుల వ్యవహారంపై ట్రోల్స్..

అదేం పిచ్చో గానీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నారు. దీప్తితో షన్ను, శ్రీహాన్‌తో సిరికి ఆల్రెడీ ట్రాక్ఉంది. శ్రీహాన్ సిరిలు త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నారు. కానీ ఇంట్లో సిరి, షన్నులు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సిరి అయితే ఐ లవ్యూలు చెబుతుంది. ముద్దులు పెడుతుంది. ఇక నిన్న షన్ను ఏదో అన్నాడని బాత్రూంలోకి వెళ్లి మరీ డోర్ పెట్టుకుని తలను గోడకేసుకుని బాదేసుకుంది. ఈ నిబ్బ వేషాలు ఎందుకు.. వీళ్లని ఎవడ్రా బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకొచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి