Bigg Boss 5 Telugu : హగ్ ఇచ్చిన సిరి.. గ్యాప్ వచ్చిందన్న షన్ను

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 23 September 2021, 5:12 pm

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో హన్ను, సిరి ట్రాక్ గురించి బయట ఎలాంటి రూమర్లు లేవు. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు మాత్రం సరి, షన్నుల గురించి దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. సిరి, షన్నులు ముందే మాట్లాడుకుని వచ్చారు అని, కలిసి ఆడుతున్నారు అని, పక్క పక్కన బెడ్లు కూడా తీసుకున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇక వెళ్లేముందు ఆ కంటెస్టెంట్లు సైతం చెప్పి మరీ వెళ్లారు. ఎవరి ఆట వాళ్లు ఆడుక్కోండి.. ఫ్రెండ్ షిప్ ఉంటే బయట చూసుకోండి.. ఇక్కడ ఆట ఆడండి అని సలహా ఇచ్చారు.

siri and shannu in bigg boss 5 telugu

siri and shannu in bigg boss 5 telugu

సిరి, షన్నుల రొమాన్స్ Bigg Boss 5 Telugu

అయితే ఈ మధ్య షన్ను కూడా సిరిని దూరం పెడుతున్నట్టు కనిపిస్తోంది. బెడ్ కూడా మార్చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. సిరి సేఫ్ గేమ్ ఆడుతోందని, ఆమె నచ్చడం లేదని, ఆమె నుంచి ఎంతో ఆశించానని షన్ను చెప్పుకొచ్చాడు. ఇకపై ఆమెకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు జెస్సీకి వివరించాడు. జెస్సీ సైతం అదే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందం ఉంది కానీ బ్రెయిన్ లేదని చెప్పినా వినడం లేదని జెస్సీ కూడా అన్నాడు.

Siri And Shannu and Sunny In Bigg Boss 5 Telugu

Siri And Shannu and Sunny In Bigg Boss 5 Telugu

అయితే తెలుగమ్మాయి అమెరికా అబ్బాయి టాస్కులో పెళ్లిళ్ల బ్రోకర్, శాస్త్రిగా షన్ను నటించాడు. ఇక అతడిని కాకపట్టి తన ఫ్రెండ్, అమెరికా అబ్బాయి శ్రీరామచంద్రతో పెళ్లి చేయించుకోవాలని సిరి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో షన్నుకు హగ్గులు ఇస్తుంది. హగ్గులు ఇచ్చిన తరువాత.. ఏంట్రా ఆపడం లేదు అని షన్నును సిరి అడిగేస్తుంది. చాలా గ్యాప్ వచ్చింది కదా? అని షన్ను అనడంతో.. సిరి కొంటెగా షన్నును కొడుతుంది. మొత్తానికి షన్ను మాత్రం హగ్గులు, కిస్సులు లేక గ్యాప్ రావడంతో హర్ట్ అయినట్టున్నాడు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి