Shanmukh : బ్రేక‌ప్ కార‌ణంగానే ష‌ణ్ముఖ్‌ని క‌ల‌వ‌డం లేదంటున్న సిరి..! | The Telugu News

Shanmukh : బ్రేక‌ప్ కార‌ణంగానే ష‌ణ్ముఖ్‌ని క‌ల‌వ‌డం లేదంటున్న సిరి..!

Shanmukh  : బిగ్ బాస్ హౌజ్‌లో ష‌ణ్ముఖ్‌- సిరి చేసిన ఘోరాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కెమెరాలు ఉన్న విష‌యం కూడా మ‌ర‌చిపోయి వారు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ క్ర‌మంలో దీప్తి సున‌య‌న‌.. ష‌ణ్ముఖ్ బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. ఐదేళ్ల తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి లైఫ్ వాళ్లు మొదలుపెట్టారు. షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్తున్నట్లు అధికారికంగా జనవరి 1న పోస్ట్ చేసింది దీప్తి సునయన.. బిగ్ బాస్‌లో ఉన్నపుడు దీప్తిని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :14 May 2022,5:30 pm

Shanmukh  : బిగ్ బాస్ హౌజ్‌లో ష‌ణ్ముఖ్‌- సిరి చేసిన ఘోరాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కెమెరాలు ఉన్న విష‌యం కూడా మ‌ర‌చిపోయి వారు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ క్ర‌మంలో దీప్తి సున‌య‌న‌.. ష‌ణ్ముఖ్ బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. ఐదేళ్ల తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి లైఫ్ వాళ్లు మొదలుపెట్టారు. షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్తున్నట్లు అధికారికంగా జనవరి 1న పోస్ట్ చేసింది దీప్తి సునయన.. బిగ్ బాస్‌లో ఉన్నపుడు దీప్తిని చాలాసార్లు తలుచుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. తనకు అన్నీ ఆమె అన్నట్లు మాట్లాడాడు. అంతేకాదు.. అక్కడికి ఎవరొచ్చినా కూడా దీప్తి గురించి అడిగేవాడు. అంత ప్రేమించుకున్న ఇద్దరూ ఎందుకు విడిపోయారబ్బా అనేది చాలా మందికి అర్థం కావడం లేదు.

సిరినే కార‌ణం అని కొంద‌రు అంటున్నారు.తాజాగా సిరిని ఇటీవ‌ల ష‌ణ్ముఖ్ తో క‌నిపించ‌డం లేద‌ని ఓ యాంక‌ర్ అడ‌గ‌గా, దానికి స్పందించిన సిరి.. బ్రేక‌ప్ త‌ర్వాత క‌ల‌వ‌డం ఎవ‌రికి మంచిది కాదు క‌దా. ఎవ‌రి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నాం. కొద్ది రోజుల త‌ర్వాత అన్నీచ‌క్క‌దిద్దుకుంటాయి అని సిరి స్ప‌ష్టం చేసింది. అయితే షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్‌లు బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు.. ఇప్పుడు ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్‌తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. కేవలం వీళ్లిద్దరే కాకుండా సిరి ప్రియుడు శ్రీహాన్.. యూట్యూబర్స్ డాన్ పృథ్వీ, తేజ్ ఇండియా వీళ్లంతా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కాబోతున్నారు.స్టార్ మా మ్యూజిక్‌లో త్వరలో ప్రసారం కాబోతున్న ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్‌ ప్రోమో విడుదల కాగా.. ఇందులో సిరి, షణ్ముఖ్, శ్రీహాన్‌లు కనిపించి సందడి చేశారు.

siri comments on shanmukh

siri comments on shanmukh

తాజాగా శ్రీహాన్.. సిరిని త‌ల‌చుకుంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. సిరిని అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది.. నాకు ఇప్పటికీ పడుతుంది కూడా.. సిరికి ఏదైనా గోల్ ఉన్నా.. ఏదైనా సాధించాలి అనుకుంటే.. ఖచ్చితంగా చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎవరు అడ్డుపడినా అస్సలు ప‌ట్టించుకోదు. తాను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి ఏదైనా సాధించాలని అనుకుంది. యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి.. సీరియల్స్.. సీరియల్స్ నుంచి మూవీస్.. మొన్న బిగ్ బాస్ వరకూ తన కష్టమే. తాను ఎవ్వరి సపోర్ట్ తీసుకోలేదు. తన కష్టంతోనే వచ్చింది. ఎంతమాట్లాడినా అర్ధం చేసుకోవడం మాత్రం చాలా కష్టం’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు.

sandeep

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...