Siri First Love Story In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ప్రేమ కథలు బయటపడ్డాయి. గురువారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరూ కూడా తమ తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఇక అందులో భాగంగా సిరి తన ప్రేమ కథను చెప్పింది. అందరినీ ఏడిపించేసింది. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు ఇది జరిగింది. అతను మా ఇంటి ముందే ఉంటాడు. కానీ నేను ఎవరితోనూ మాట్లాడినా అతను తీసుకోలేకపోతాడు.
Siri First Love Story In Bigg Boss 5 Telugu
అతనికి అంత పొసెసివ్. అయితే ఆ సమయంలో ఓ సారి గొడవ పెద్దది అయింది.ఆ టైంలోనే ఇంట్లో ఓ సంబంధం చూస్తున్నారు. అతని మీద కోపంతో ఇంట్లో ఓకే చెప్పాను. ఆ తరువాత మా ఇంటికి వచ్చాడు. నాతో మాట్లాడాడు. కాళ్ల మీద పడ్డాడు. తప్పు చేశాను అలా మాట్లాడి ఉండకూడదు అని బతిమాలాడు. ఇక నిశ్చితార్థం రేపు అనగా..
Siri First Love Story In Bigg Boss 5 Telugu
ఈ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాం. ఆ తరువాత మా ఇంట్లోవాళ్లు నన్ను తీసుకొచ్చారు. మా అమ్మ నాతో మాట్లాడింది. అలా కొన్ని రోజులు గడిచాయి. మేం ఇద్దరం రిలేషన్‌లోనే ఉన్నాం. గొడవలు జరుగుతూనే ఉండేవి.
Siri First Love Story In Bigg Boss 5 Telugu
ఓ రోజు సడెన్‌గా రాత్రి మూడు గంటలకు నిద్రలోంచి లేచాను. చూస్తే అంతా ఏం అనిపించలేదు. మళ్లీ పడుకున్నాను. ఉదయం లేచాను. లేచే సరికి అతను చనిపోయాడు అనే వార్త వచ్చింది. రాత్రి మూడు గంటలకు నిద్రలేచాను అని చెప్పాను కదా? అదే సమయంలో అతనికి యాక్సిడెంట్ అయింది. అతని కోసం నేను ఎన్నో చేశాను. కానీ దేవుడు మాత్రం అతన్ని నాకు కాకుండా చేశాడు. ఐ లవ్యూ అంటూ సిరి తెగ ఏడ్చేసింది. అందరినీ కన్నీరు పెట్టించేసింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.