Bigg Boss 5 Telugu : ఆ సమయంలోనే లేచిపోయాను.. అసలు విషయం చెప్పిన సిరి

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 24, 2021, 8:34 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ప్రేమ కథలు బయటపడ్డాయి. గురువారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరూ కూడా తమ తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఇక అందులో భాగంగా సిరి తన ప్రేమ కథను చెప్పింది. అందరినీ ఏడిపించేసింది. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు ఇది జరిగింది. అతను మా ఇంటి ముందే ఉంటాడు. కానీ నేను ఎవరితోనూ మాట్లాడినా అతను తీసుకోలేకపోతాడు.

Siri First Love Story In Bigg Boss 5 Telugu

Siri First Love Story In Bigg Boss 5 Telugu

అతనికి అంత పొసెసివ్. అయితే ఆ సమయంలో ఓ సారి గొడవ పెద్దది అయింది.ఆ టైంలోనే ఇంట్లో ఓ సంబంధం చూస్తున్నారు. అతని మీద కోపంతో ఇంట్లో ఓకే చెప్పాను. ఆ తరువాత మా ఇంటికి వచ్చాడు. నాతో మాట్లాడాడు. కాళ్ల మీద పడ్డాడు. తప్పు చేశాను అలా మాట్లాడి ఉండకూడదు అని బతిమాలాడు. ఇక నిశ్చితార్థం రేపు అనగా..

Siri First Love Story In Bigg Boss 5 Telugu

Siri First Love Story In Bigg Boss 5 Telugu

 

ఈ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాం. ఆ తరువాత మా ఇంట్లోవాళ్లు నన్ను తీసుకొచ్చారు. మా అమ్మ నాతో మాట్లాడింది. అలా కొన్ని రోజులు గడిచాయి. మేం ఇద్దరం రిలేషన్‌లోనే ఉన్నాం. గొడవలు జరుగుతూనే ఉండేవి.

 Bigg Boss 5 Telugu సిరి ప్రేమ కథ..

Siri First Love Story In Bigg Boss 5 Telugu

Siri First Love Story In Bigg Boss 5 Telugu

ఓ రోజు సడెన్‌గా రాత్రి మూడు గంటలకు నిద్రలోంచి లేచాను. చూస్తే అంతా ఏం అనిపించలేదు. మళ్లీ పడుకున్నాను. ఉదయం లేచాను. లేచే సరికి అతను చనిపోయాడు అనే వార్త వచ్చింది. రాత్రి మూడు గంటలకు నిద్రలేచాను అని చెప్పాను కదా? అదే సమయంలో అతనికి యాక్సిడెంట్ అయింది. అతని కోసం నేను ఎన్నో చేశాను. కానీ దేవుడు మాత్రం అతన్ని నాకు కాకుండా చేశాడు. ఐ లవ్యూ అంటూ సిరి తెగ ఏడ్చేసింది. అందరినీ కన్నీరు పెట్టించేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp