Mukku Avinash : ముక్కు అవినాష్.. అరియానాను వదిలేశాడా? ఈ అమ్మాయి వెనుక పడ్డాడేంటి?
Mukku Avinash : ముక్కు అవినాష్ తెలుసు కదా. ఆయన్నే బిగ్ బాస్ అవినాష్ అని కూడా పిలుస్తారు. బిగ్ బాస్ అవినాష్.. ముందు జబర్దస్త్ లో స్కిట్లు చేసేవాడు. కానీ.. ఆయనకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో.. జబర్దస్త్ ను వదిలేసి… బిగ్ బాస్ కు వెళ్లాడు. అయితే.. జబర్దస్త్ లో రాని ఫేమ్.. అవినాష్ కు బిగ్ బాస్ ద్వారా వచ్చింది. ప్రస్తుతం అవినాష్ ఒక సెలబ్రిటీ. అంతే కాదు.. బిగ్ బాస్ లో మనోడు అరియానాతో ప్రేమాయణం కూడా నడిపించాడు. ఎవ్వరికీ పడని అరియానా.. అవినాష్ జోకులకు పడిపోయింది. ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగారు.

mukku avinash and siri hanumanth in comedy stars
బయటికి వచ్చాక కూడా వీళ్ల రిలేషన్ షిప్ అలాగే కొనసాగింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే వీళ్ల మధ్య ప్రేమ ఉందని అనుకున్నాం కానీ.. బయటికి వచ్చాక వీళ్ల రిలేషన్ షిప్ కేవలం ఫ్రెండ్ షిప్ అని తేలింది. చాలాసార్లు అరియానా.. ఎన్నో స్టేజ్ ల మీద అవినాష్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అరియానా కూడా ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. తను కూడా ఫుల్ బిజీ. ఇక.. అవినాష్.. స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. అది కూడా కామెడీ షోనే. అందులో కామెడీ స్కిట్లు చేస్తూ బిజీ అయిపోయాడు.

mukku avinash and siri hanumanth in comedy stars
Mukku Avinash : సిరి హనుమంతును తన స్కిట్ లో తీసుకున్న అవినాష్
అవినాష్.. చాలా సార్లు తన స్కిట్లలో అరియానాను తీసుకున్నాడు. కానీ.. గత కొన్ని స్కిట్ల నుంచి అవినాష్ ఎక్కువగా సోషల్ మీడియా ఫేం, సీరియల్ ఫేమ్ సిరి హనుమంతును తీసుకుంటున్నాడు. ఏంటి.. అరియానాను వదిలేసి… అవినాష్.. సిరి వెంట పడుతున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

mukku avinash and siri hanumanth in comedy stars
తన స్కిట్లలో తనకు మంచి రోలే ఇస్తున్నాడు. ఏది ఏమైనా.. అవినాష్.. సిరికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే ఇద్దరి మధ్య ఏదో ఉంది? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా… ఈ పుకారుపై అవినాష్ మాత్రం నోరు విప్పడం లేదు. తాజాగా కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్.. లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో అవినాష్ తన స్కిట్ లో సిరి హనుమంతుకు ఎటువంటి రోల్ ఇచ్చాడో మీరే ఈ ప్రోమోలో చూడండి.
