Bigg Boss 5 Telugu : మా ఇద్దరికీ బంధం ఏర్పడింది.. షన్నుపై ప్రేమను బయటపెట్టేసిన సిరి

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 18, 2021, 7:15 pm

Bigg Boss 5 Telugu :  సిరికి ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. సిరి ప్రేమ కథల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ ఇంటి బయట శ్రీహాన్ రెడిగా ఉన్నాడు. పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందామని ఓ లెటర్ కూడా రాశాడు. ఇక షన్ను కోసం దీప్తి సునయన కూడా ఉంది. షన్ను విన్ అవ్వాల్ని దీప్తి సునయన బాగానే కష్టపడుతోంది. ఓట్లు వేయమని అడుగుతోంది. వీరిద్దరూ ఇలా బయట వారి కోసం కష్టపడుతున్నారు. కానీ వారిద్దరూ లోపల మాత్రం హగ్గులు, ముద్దులు అంటూ హద్దులు దాటుతున్నారు. మరీ ముఖ్యంగా సిరి కొంచెం కూడా బుద్దిలేనట్టుగా వ్యవహరిస్తోంది.

Siri Open Comments On Shannu In Bigg Boss 5 Telugu

Siri Open Comments On Shannu In Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu :  ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోనట్టు కనిపిస్తోంది. నిజంగానే సోషల్ మీడియాలో నిబ్బ బ్యాచ్‌లా ప్రవర్తిస్తోంది. షన్నుకు కొన్ని వందల సార్లు ఐలవ్యూలు చెప్పి ఉంటుంది సిరి. కానీ షన్ను మాత్రం ఒక్కసారి కూడా చెప్పి ఉండదు. ఎందుకంటే తనకు తన లిమిట్స్ ఏంటో కాస్త తెలుసు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంటాడు. ఇక షన్ను ఎంత దూరం పెట్టినా కూడా సిరి మాత్రం సిగ్గు లేకుండా కొన్ని పనులు చేస్తూనే ఉంటుంది. టైట్ హగ్గులు కామన్ అయిపోయాయి. కానీ ఈ మధ్య ముద్దులు కూడా పెట్టేస్తోంది.

ఆ మధ్య నుదురు మీద పెట్టింది.. ఇప్పుడు చెంప మీద పెట్టింది. షన్ను వెరైటీ రియాక్షన్లు ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మళ్లీ మొన్న గొడవ జరిగింది. బాత్రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకుని తలబాదుకుంది. అసలు ఏం జరిగింది ఎందుకు అలా చేశావ్ అని రవి అడిగాడు. మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడింది అంతే.. వాడు ట్రిప్ అవుతున్నాడు. నా తప్పు కూడా ఉంది.. మేం ఇద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం అని సిరి అంటుంది. మీ ఇద్దరిది ఏంటో అర్థం కావడం లేదు.. కాస్త ఎక్స్ ట్రాలకు వెళ్తోన్నట్టుంది చూసుకోండి అని రవి అన్నాడు.

Cinema Desk

No bio available for this author.

  1. "Tatkal Ticket Refund : తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు కట్ అవుతుంది? రీఫండ్ రూల్స్ ఇవే!"

  2. "Ginger Tulsi Tea : గొంతు నొప్పి, జలుబుతో ఇబ్బందా? ఇంట్లోనే అల్లం తులసి టీ ఇలా తయారు చేసుకోండి!"

  3. "AP Telangana Rains : ఆర్నాబ్ తుఫాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల భయం.. ఈ జిల్లాల్లో అప్రమత్తతం..!"

  4. "Hyper Aadi : మళ్లీ జనసేన కోసం హైపర్ ఆది.. ఇంటింటి ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్లు!"

  5. "Vijay Deverakonda : రష్మికతో విడాకుల ప్రచారం.. ఒక్క కిస్ ఫొటోతో విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై..!"

  6. "Anirudh Reddy : నేను చచ్చిపోయాక నిధులు ఇవ్వండి.. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!"

  7. "Chandrababu : కూటమి నేతలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ విషయంలో నో కాంప్రమైజ్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp