Sita Ramam Movie : ఇంత హైప్‌ వచ్చినా మరీ అంత తక్కువ బిజినెస్ ఏంటి భయ్యా? – సీతారామం 

Authored By aruna | The Telugu News | Published on: August 4, 2022, 8:40 pm

Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్ ఖాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ను రష్యా లో తెరకెక్కించాం.. భారీ బడ్జెట్తో రూపొందించాం అంటూ ఈ చిత్రం యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాహుబలి హీరో ప్రభాస్ కూడా రావడం తో అంచనాలు భారీగా పెరిగాయి. ఇంత భారీ అంచనాలున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ అయ్యి ఉంటుందని.. కనుక 30 నుండి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉంటుందని అంతా భావించారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మాత్రమే చేసినట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమా ను ప్రేక్షకులు చూడాలని ఆసక్తితో ఉన్నారు, అయినా కూడా బయ్యర్లు ఈ సినిమా ను భారీ మొత్తానికి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఈ సినిమా కేవలం 17 కోట్లకు అమ్ముడు పోతే 30 కోట్ల బడ్జెట్ రికవరీ ఎలా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. శాటిలైట్ ద్వారా మరో పది కోట్లు వస్తే.. ఓటీటీ ద్వారా మరో పది కోట్ల వరకు వస్తాయేమో చూడాలి. మొత్తానికి ఈ సినిమా నిర్మాతలకు లాభాలు ఎంత వరకు వస్తాయో చూడాలి.

Sita Ramam Movie pre release business shocking

Sita Ramam Movie pre release business shocking

సినిమా సూపర్‌ హిట్ అవ్వకుంటే మాత్రం నిర్మాతలకు పెద్ద నష్టం తప్పదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో నటించిన దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు హీరో కాకపోవడం వల్లే బిజినెస్ ఎక్కువ కావడం లేదని సమాచారం అందుతోంది. అసలు విషయం ఏంటి అనేది సినిమా విడుదలైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని గంటల్లో సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రష్మిక మందన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp