Sitara Ghattamaneni : రెడ్ డ్రెస్ లో బంగారు బొమ్మలా ఉన్న సితార పాప .. అందంలో తండ్రికి తగ్గ తనయ ..!
Sitara Ghattamaneni : టాలీవుడ్ గారాల కూతురు సితార ఘట్టమనేని తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడడానికి చాలా క్యూట్ గా ఉండే సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో తన డాన్స్ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకున్నా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో కూడా పలు వీడియోలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సితార.
ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ లు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటారు. ఈ క్రమంలోనే సితారకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల సితార పిఎంజె జ్యువెలర్స్ వారి షార్ట్ ఫిలిం యాడ్ లో నటించింది. ఈ యాడ్ తో సితార అందరిని ఆకట్టుకుంది. సింపుల్ కాన్సెప్ట్ తో పాటు అదిరిపోయే విజువల్స్ తో పాటు సితార అందం, అభినయం అందరిని ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఆ ఫోటోలలో సితార రెడ్ డ్రస్సులో చాలా క్యూట్ గా, బంగారు బొమ్మలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందంలో సితార పాప తండ్రికి తగ్గ తనయా అని కొందరు, రెడ్ డ్రస్సులో సితార బంగారు బొమ్మలా ఉందని మరికొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏదేమైనా సితార స్టార్ కిడ్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా అందంలో, అభినయంలో తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకున్నారు.