
sitara surprises anee master
Sitara : థర్డ్ వేవ్‌లో కరోనా మహమ్మారి సినీ పరిశ్రమకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. చాలా మంది ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్, బిగ్ బాస్ ఫేం యానీ మాస్టర్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఆమె కరోనాకు గురవ్వడం ఇది రెండోసారి. ‘గతేడాది కూడా నాకు కరోనా సోకింది. 24 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉన్నాను. 2021 జనవరి 23న నాకు కరోనా తగ్గింది. అయితే మళ్లీ ఇప్పుడు జనవరి 24న కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ కరోనా వైరస్ ఏమైనా కచ్చితమైన సమయం మెయింటెన్ చేస్తుందా? క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది’ అని తన ఇన్‌స్టాలో పేర్కొంది అనీ మాస్టర్.
కరోనా వలన క్వారంటైన్‌లో ఉన్న అనీ మాస్టర్ లైవ్‌లోకి వచ్చింది. ఆ సమయంలో లోబోని కూడా జాయిన్ చేసింది. ఇలా లైవ్ సెషన్ జరుగుతుండగా.. సడెన్‌గా మహేష్ బాబు కూతురు సితారా వచ్చింది. హాయ్ మేడం అంటూ కామెంట్ పెట్టింది. ఎలా ఉన్నారు.. అని అడిగింది. దీంతో ఆనీ మాస్టర్ .. హాయ్ సితారా అని పలకరించింది. అలానే లోబోని ఇంట్రడ్యూస్ చేసింది. ఇతను లోబో.. బిగ్ బాస్ కంటెస్టెంట్.. సేమ్ నాలానే చేస్తున్నాడు కదా? అందుకే నా ఫ్రెండ్ అయ్యాడు అంటూ సితారాకు లైవ్‌లోనే వివరించింది ఆనీ మాస్టర్.లోబో చేష్టలకు సితార నవ్వుతున్నట్టు హహహ అని కామెంట్ పెట్టేసింది.
sitara surprises anee master
నేను కోలుకున్నాక కలుద్దాం సితార.. నాటు నాటు స్టెప్పులు వేద్దామంటూ ఆనీ మాస్టర్ చెప్పడం.. ఓకే మేడం అని సితారా రిప్లై ఇవ్వడం జరిగింది. లవ్యూ సితారా అని అంటే.. ఐ లవ్యూ అని సితారా కూడా కామెంట్ చేసింది. మొత్తానికి అనీ మాస్టర్, సితార మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరికి ఆసక్తిని కలిగిస్తుంది.కాగా ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. యానీ మాస్టర్, రవి, లోబో, లహరి, శ్రీరామచంద్ర ఇలా అందరూ కలిసి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు యానీ మాస్టర్‌కు కరోనా అని తేలడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.