Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను కేంద్రప్రభుత్వ సంస్థ ఒకటి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల కోసం ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఈఎస్ఐసీ(ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) తెలిపింది.ఈఎస్ఐసీ భర్తీ చేయబోయే మొత్తం ఖాళీలు 3,820 పోస్టులు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో పేర్కొంది ఈఎస్‌ఐసీ. ఇకపోతే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదువుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల్లో ఏపీలో 35 పోస్టులున్నాయి. అందులో 25 అప్పర్ డివిజన్ క్లర్క్, 26 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 02 స్టెనో గ్రాఫర్ పోస్టులున్నాయి. తెలంగాణలో 72 పోస్టులు భర్తీ చేయనుంది. 25 అప్పర్ డివిజన్ క్లర్క్స్ , 43 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, 04 స్టెనో గ్రాఫర్ పోస్టులు ఉన్నాయి.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఎంటీఎస్ పోస్టులకుగాను పదో తరగతి అర్హత. కాగా, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత గా నిర్ణయించారు. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకుగాను ఏదేని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వారి ఏజ్ 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇకపోతే ఈ పోస్టులకుగాను అప్లికేషన్ ప్రాసెస్ ఆన్ లైన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కు లాస్ట్ డేట్ ఈ నెల 15వ తేదీ. కాగా, పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. అర్హులైన వారు వీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఖాళీల భర్తీకిగాను ప్రిలిమినరీ, మెయిన్స్ టెస్టుతో పాటు స్కిల్స్ టెస్ట్ కూడా ఉంటుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.