Sneha : ఎవ‌డ్రా.. నా భ‌ర్త నుండి విడిపోయింద‌న్న‌ది.. గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన అందాల న‌టి స్నేహ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sneha : ఎవ‌డ్రా.. నా భ‌ర్త నుండి విడిపోయింద‌న్న‌ది.. గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన అందాల న‌టి స్నేహ..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 November 2022,1:40 pm

Sneha : దివంగత హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రియుల మదిని దొచుకున్న అందాల ముద్దుగుమ్మ స్నేహ. రాధ గోపాలం.. శ్రీరామదాసు.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ‌ తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో ప్రసన్న కుమార్ ను 2011లో ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం మ‌నంద‌రికి విదిత‌మే. ప్ర‌స్తుతం వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడిప్పుడే ప‌లు సినిమాల‌లో రీఎంట్రీ ఇస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో పాటు అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో కీలకపాత్రలలోను నటించి మెప్పించింది.

అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న స్నేహ‌… గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు దొచుకుంది. ప్రేమ కథలలో మాత్రమే కాకుండా మంచి భక్తిరస చిత్రాలలో కూడా నటించి గుర్తింపు అందుకుంది. తెలుగులో శ్రీరామదాసు సినిమాలో ఆమె నటించిన విధానానికి ప్ర‌తి ఒక్క‌రు అప్పట్లో ఆశ్చర్యపోయారు. రవితేజతో చేసిన వెంకీ సినిమా కూడా ఆమెకు మంచి సక్సెస్ ను అందించిందనే చెప్పాలి.

sneha clears the all rumors

sneha clears the all rumors

Sneha : ఇలా చెక్ పెట్టింది..!

అయితే కొద్ది రోజులుగా స్నేహా, ఆమె భ‌ర్త విడిపోయిన‌ట్టు జోరుగా ప్ర‌చారాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తమ బంధం గురించి వస్తున్న రూమర్స్ పై ఎట్టకేలకు హీరోయిన్ స్నేహ సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్నేహ తన భర్త ప్రసన్నతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. భర్తని హగ్‌ చేసుకుని చాలా క్లోజ్‌గా, ప్రేమగా ముద్దు పెడుతున్న పిక్ ని పంచుకుంటూ `ట్విన్నింగ్‌` అంటూ పోస్ట్ షేర్ చేసింది.. వీకెండ్‌ సందర్భంగా సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నామనే అర్థంలో స్నేహ ఈ పోస్ట్ ఉంది.. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతూ, డైవర్స్ రూమర్స్ చెక్‌ పెట్టిందని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది