Chiranjeevi – Indira Devi : నేడు తెల్లవారు జామున సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి గారు మృతి చెందిన విషయం అందరికీ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆమె మరణం కృష్ణ, మహేష్ బాబు కుటుంబ సభ్యులను కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. కేవలం కృష్ణ, మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా టాలీవుడ్ మొత్తం కూడా నేడు సంతాప దినంగా భావిస్తుంది. చాలా మంది ఫిలిం మేకర్స్ అనధికారికంగా సంతాప దినంగా భావించి సినిమా యొక్క షూటింగ్ లను ఆపివేశారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నేడు గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సరే ముందుగా ప్లాన్ చేసిన కార్యక్రమం కనుక ఆపివేస్తే భారీ ఆర్థిక నష్టం వస్తుంది కనుక నిర్వహించుకోవడంలో తప్పులేదు.
కానీ చిరంజీవి నేడు చేసిన ట్వీట్ విమర్శలకు తెర లేపింది. నేటితో రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 సంవత్సరాలు పూర్తి అయింది. అంటే చిరుత సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు యొక్క విజయాన్ని పురస్కరించుకొని సంతోషంగా ఒక ట్వీట్ చేశారు. ఇందిరా దేవి మృతి చెందిన కొన్ని గంటల్లోనే చిరంజీవి వంటి పెద్ద వ్యక్తి నుండి ఇలాంటి ట్వీట్ రావడం చాలా మందికి అసంతృప్తిగా ఉంది. ఒక వైపు కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీ దుఃఖంలో ఉండగా మీరు 15 ఏళ్ల సంబరం అంటూ ఫోటోలను షేర్ చేసి ఇలా సెలబ్రేషన్లు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విషయంలో మెగాస్టార్ కి మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు ఉదయాన్నే ఇందిరా దేవి గారి మరణానికి సంతాపం తెలియజేశారు. అంతకు మించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాతనే చిరంజీవి గారు ఆ ట్వీట్ చేశారు. అంత్యక్రియలు అన్ని పూర్తి అయిన తర్వాత చిరంజీవి చేసిన ట్వీట్ ని కొందరు కావాలని వివాదాస్పదం చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు మహేష్ బాబు అభిమానులమంటూ చిరంజీవిని విమర్శించడం అస్సలు కరెక్ట్ కాదని, ఇలాంటి విషయాలను పెద్దవిగా చేసి చూడడంతో ఇండస్ట్రీలో మంచి వాతావరణం మిస్ అవుతామంటూ.. మెగా అభిమానులు ఆ విమర్శలు చేసే వాళ్లకు ఇకనైనా ఆపండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు..
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
This website uses cookies.